అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరిగితే రేప్ లు జరగవా..!?

Chakravarthi Kalyan
సమాజంలో స్త్రీల పట్ల లైంగిక హింస పెరుగుతోంది. ముక్కపచ్చలారని బాలికల నుంచి వివాహితల వరకూ అత్యాచారాలకు గురవుతున్నారు. జాతీయ స్థాయి నేర గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరి ఎందుకు ఇలా స్త్రీలపై నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ఏం చేయాలి.. ఈ అంశంపై విభిన్నంగా స్పందించాడో బీజేపీ ఎమ్మెల్యే.



అమ్మాయిలు విచ్చలవిడిగా అబ్బాయిలతో తిరగడం వల్లే రేప్ లు జరుగుతున్నాయంటూ బాధ్యత లేకుండా మీడియా ముందు మాట్లాడాడు. బోయ్ ప్రెండ్ కల్చర్ వల్లే మానభంగాలు వంటి నేరాలు జరుగుతున్నాయని సదరు ఎమ్మెల్యే అబిప్రాయపడుతున్నారు. యువతులపై లైంగిక హింస పెరగడానికి బాయ్ ప్రెండ్ కల్చర్ అని స్పష్టం చేశారు. 


మధ్యప్రదేశ్ కు చెందిన బిజెపి ఎమ్మెల్యే పన్నాలాల్ సఖ్య వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అంతే కాదు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వంటివి జరపడం ప్రాశ్చాత్య సంస్కృతి అని, హిందూ పండగలు నాలుగు మహిళా దేవతలను పూజించేవి దేశంలో ఉన్నాయని పన్నాలాల్ కామెంట్ చేశారు.


పన్నాలాల్ కామెంట్లపై అక్కడి మహిళాసంఘాలు, మానవహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: