కడపలో జగన్ కు ఎదురుదెబ్బ...ఏకంగా 7 గురు జంప్ ?
టీడీపీ పార్టీలో చేరేందుకు మధ్యాహ్నం నుంచి విజయవాడకు వెళ్లనున్నారు 7 గురు వైసీపీ పార్టీ కార్పొరేటర్లు. కడప కార్పొరేషన్ కు సంబంధించిన ఏడు మంది కార్పొరేటర్ల జంప్ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తోంది. రేపు మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగు దేశం పార్టీ కండువా వేసుకోనున్నారు ఈ 7 గురు వైసీపీ పార్టీ కార్పొరేటర్లు.
అయితే..ఈ 7 గురు వైసీపీ పార్టీ కార్పొరేటర్లు జంప్ అవుతారని వార్తలు రాగానే... వెంటనే వైసీపీ పార్టీ అలర్ట్ అయింది. ఇందులో భాగంగానే... వైసీపీ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగాడు. వైసీపీ కార్పొరేటర్లతో చర్చలు జరిపారు వైసీపీ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కానీ 7 గురు వైసీపీ పార్టీ కార్పొరేటర్లతో వైసీపీ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జరిపిన చర్చలు విఫలం కావడం మనం చూశాం.
కడప నగరంలోని అలంకానపల్లెలో నిన్న సాయంత్రం మున్సిపల్ కార్పొరేటర్లతో ఎంపీ సమావేశం కాగా...ఆ మీటింగ్ లో వైసీపీ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నిరాశే ఎదురైంది. కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సమావేశానికి అసంతృప్తి కార్పొరేటర్లు అందరూ డుమ్మా కొట్టారు. గత రెండు నెలల క్రితం వైసీపీని వీడి 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ...టిడిపిలో చేరడం జరిగింది. కార్పొరేషన్ లో కుర్చీల గోల తర్వాత అసంతృప్తి కార్పొరేటర్ల పై దృష్టి సారించిన టిడిపి..ఇప్పుడు వైసీపీ నేతలను తీసుకుంటోంది.