కర్ణాటకలో ఎలక్షన్స్ వాయిదా వేస్తారా..?

Edari Rama Krishna
ఈ మద్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన బీజేపీ త్వరలో కర్ణాటకలో జరగబోయే ఎన్నికల విషయంలో ఎందుకో కాస్త బయపడుతున్నట్లు కనిపిస్తుంది.  కారణం కొంత కాలంగా బీజేపీకి ఎదురు గాలి వీస్తుంది.  ఇప్పటికే పంజాబ్ లోని లూథియానా, మద్యప్రదేశ్  ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కి మంచి ఊతం ఇచ్చాయి.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో ఎన్నికలు జరిగితే..పట్టు కోల్పోతే ఇంకేమైనా ఉందా..! ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల పై పడుతుందని భావిస్తున్నారు..ప్రధాని మోదీ, అమిత్ షా.

కర్ణాటక రాష్ట్రానికి షడ్యుల్ ప్రకారం మే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది... అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, కర్ణాటకలో బీజేపీ గెలిచే అవకసామే లేదు... దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కూడా... అయితే కర్ణాటకలో గెలిచి, దక్షిణ భారత దేశంలో, మిగతా రాష్ట్రాల్లో పట్టు సాధించాలానేది అమిత్ షా, మోడీ ఆలోచన... కాని ఆ పరిస్థితి ఏ మాత్రం కనిపించటం లేదు... ఎలక్షన్స్ జరుగుతున్న కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. అవినీతి పై పోరాటం అంటూ, గాలి జనార్ధన్ రెడ్డి, ఎడ్యురప్ప లాంటి అవినీతి నేతలకు ముందు పెట్టి, ఎలక్షన్స్ కు వెళ్తున్నారు మోడీ, అమిత్ షా... అలాగే దక్షినాది రాష్ట్రాల పై, మోడీ చూపిస్తున్న సవతి ప్రేమ కూడా, ప్రజల ఆగ్రహానికి కారణం అయ్యింది.

మరోవైపు జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాహూల్ గాంధీ మంచి దూకుడు మీదే ఉన్నారు. అందుకే మోడీ, షా, మొదటి సారి ఎలక్షన్స్ అంటే భయపడుతున్నారా అంటే ? అవును అనే సంకేతాలు వస్తున్నాయి... కర్ణాటక ఎలక్షన్స్ ఆరు నెలలు పాటు వాయిదా వెయ్యటానికి సహకరించమని కేంద్రం, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... వన్ నేషన్, వన్ ఎలక్షన్ లో భాగంగా, నవంబర్ దాకా కర్నాటక ఎలక్షన్స్ వాయిదా వేస్తే తమ బలం పుంజుకునే ప్రయత్నాలు చేయవచ్చని కేంద్ర సర్కార్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. 

ఆరు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలకు ఒకేసారి వెళ్ళవచ్చు అనేది ఆ లేఖ సారంశం.ప్రస్తుతం కర్నాటకలో పరిస్థితి బాగోలేదు కాబట్టి, కొన్నాళ్ళు ఎన్నికలు జరగకుండా మోడీ, షా ప్లాన్ చేసినట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి... మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికలు కూడా, వరదలు వంక చూపించి, కొన్ని నెలలు వాయిదా వేసిన సంగతి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: