అమెరికా కోర్టులో నీరవ్‌ మోదీ దివాలా పిటిషన్‌

నేరగాళ్ళని చట్టాలు బంధించలేకపోతున్నాయి. ఒక వేళ బంధించినా వారిని చట్టం నుండి రక్షించటానికి రాజకీయం అనే రక్షణ కవచం ఉండనే ఉంది. నేరగాళ్లుగా అభి యోగాలు ప్రారంభం కాగానే దేశం వదలి ఈ ముద్ధాయిలు అతి సునాయాసంగా తప్పించుకొని పారిపోతూ విదేశాల్లో చక్కగా విలాసవంతంగా జీవించేస్తున్నారు. ఉదాహరణ కు ఇటీవలి సంఘటనలే చాలు విజయ్ మాల్యా ఆ తరవాత అతి స్వల్ప కాలంలోనే మరో సంఘటన నీరవ్ మోదీ. మనకున్న రాజ్యాంగ వ్యవస్థలు ఏమీ చేయలేక పోతు న్నాయి. నాడు యుపిఏ ప్రభుత్వమైనా నేడు ఎన్డిఏ ప్రభుత్వమైనా పరిస్థితుల్లో పెద్ద భేదం లేదు.


ఆయ‌న దేశంలోని బ్యాంకు కుంభ‌కోణాల్లో ఆరితేరిన వాడుగా ఉన్నాడు. ప్ర‌స్తుతం దేశం నుంచి పారిపోయి విదేశాల‌లో దాక్కున్నాడు. అత‌డే పీఎన్బీ కుంభ‌కోణం ప్ర‌ధాన సూత్ర‌ధారి నీరవ్ మోదీ. మీడియాలో వ‌చ్చిన క‌థనాల ప్ర‌కారం అత‌డు అమెరికాలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యంలో నీర‌వ్ మోదీకి సంబంధించి అమెరికా ప్ర‌భుత్వం అధికారికంగా చేతులెత్తేసింది. భారత్‌లోని బ్యాంకులను మోసగించిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ తమ దేశంలో ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం నిర్థా రించలేకపోయింది.


నీరవ్‌మోడీ అమెరికాలో ఉన్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నప్పటికీ తాము నిర్థారించలేక పోతున్నామని విదేశాంగ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అమెరిక యుఎస్ దివాలా న్యాయస్థానం నీడన రక్షణ కూడా దొరికింది  ఊరట లభించింది. ఆయనకు చెందిన 'ఫైర్‌-స్టార్‌ డైమండ్‌ సంస్థ' అమెరికాలోని కోర్టులో దివాలా పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దీనికి సంబంధించిన విచారణను న్యాయస్థానం చేపట్టింది. ఋణ దాతలు నీరవ్‌ మోదీ దగ్గర నుంచి ఋణాలను ఇప్పుడే వసూలు చేయవద్దని, అతడి మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు పేజీల నివేదికను విడుదల చేసింది.


ఈ నివేదిక ప్రకారం నీరవ్‌ మోదీకి ఋణాలు ఇచ్చిన ఋణదాతలు ఆయన దగ్గర నుంచి డబ్బులు తిరిగి తీసుకోవడం కుదరదు. ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటివి చేయ కూడదు. నీరవ్‌ మోదీ పై ఋణదాతలు ఎటువంటి చట్ట పరమైన చర్యలు తీసుకునే పిటిషన్లు దాఖలు చేయకూడదు. ఋణం చెల్లించాల్సిందిగా ఋణ గ్రహీత ఐన ఫైర్-స్టార్ డైమండ్స్ కు ఫోన్‌, మెయిల్‌ చేసి డిమాండ్‌ చేయకూడదు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఎవరైనా నీరవ్‌ ఫైర్‌ స్టార్‌ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసు కోవాలని ప్రయత్నిస్తే, ఋణదాతలపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అమెరికలో న్యాయస్థానం హెచ్చరించింది. దీనికి సంబంధించిన నివేదికను నీరవ్‌ మోడీ కు రుణాలు ఇచ్చిన స్టాక్‌-హోల్డర్స్‌కు పంపించింది.


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ₹12700 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్‌ మోదీకి చెందిన ఫైర్‌-స్టార్‌ డైమండ్‌ సంస్థ ఈనెల 26న అమెరికా కోర్టులో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. పునర్వ్యవస్థీకరణకు వీలు కల్పించే అమెరికా నిబంధనల ప్రకారం ఫైర్‌ స్టార్‌ డైమండ్‌ సంస్థ దీన్ని నమోదు చేసింది. వ్యాపారాన్ని సజీవంగా నిలుపుకోవడంతో పాటు ఋణదాతలకు అప్పులు తిరిగి చెల్లించే వెసులుబాటు కోసం ఒక ప్రణాళికను ప్రతిపాదిస్తూ ఈ తరహా పిటిషన్‌ను దాఖలు చేస్తారు. మరోవైపు ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు అమెరికాలో పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు కూడా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: