శ్రీదేవి జాతకంలో సంచలనం.. మరి ఇలా ఎలా జరిగింది..?

Chakravarthi Kalyan
ప్రముఖ నటి శ్రీదేవి అనూహ్యంగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరణించేనాటికి ఆమె వయస్సు 54 సంవత్సరాలు మాత్రమే. ఆమె మరణవార్త యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. చివరిసారి ఆమెకు కడసారి వీడ్కోలు పలుకుతోంది. ఇదిలా ఉంటే ఆమె జాతకానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగు చూసింది. 


శ్రీదేవి మరణవార్త విని ఆశ్చర్యపోయిన ఓ జ్యోతిష్యుడు ఆమె జాతకాన్ని సమూలంగా పరిశీలించారు. శ్రీదేవి 1963 ఆగస్టు 13వ తేదీ ఉదయం 5.30 గంటల సమయంలో  చెన్నై నగరంలొ జన్మించారు. ఆ సమయాన్ని బట్టి శ్రీదేవి కృతికా నక్షత్రం, మూడవ పాదం, వృషభ రాశిలో జన్మించారట. ఆమె లగ్నం కర్కాటకం.. ప్రస్తుతం ఆమెకు శని మహార్దశ జరుగుతోంది. 


అంటే జాతకం ప్రకారం అంతా సవ్యంగానే ఉందన్నమాట. వాస్తవానికి జాతకం ప్రకారం ఆమె ఆయుస్సు 70 సంవత్సరాల వరకూ ఉందట. మరి అంత ఆయస్సు ఉంటే ఎందుకు దాదాపు 16 ఏళ్ల ముందే ఎందుకు మరణించారు. అందుకు కారణం ఏంటి అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 



దీనికి జ్యోతిష్యులు చెప్పే సమాధానం ఏంటంటే.. ఆమెకు 70 వరకూ ఆయస్సు ఉన్నా..దాన్ని ఆమె నిలుపుకోలేకపోయారని అంటున్నారు. జాతకం ప్రకారం ఆమెను మృత్యువు వెంటాడలేదట. ఆమే మృత్యువును కొనితెచ్చుకున్నారట. ఐతే.. ఈ వాదన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏది ఏమైనా జాతకం ప్రకారం ఆమె జీవించి ఉంటే బావుండేదని అభిమానులు నిట్టూరుస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: