బండవేసిన కొండ ఎవరికి గుదిబండ

వైఎస్ తన కు దైవమని, పార్టీని, మంత్రి పదవిని వీడిన కొండా సురేఖపై ఇప్పుడు అందరి దృష్టిపడింది. జగన్ పై ఆమె సంధించిన లేఖాస్థ్రం, ఆమె చేసిన విమర్శలు గతంలో ఆమె నోట జగన్ ను కొనియాడిన మాటలకు పూర్థి భిన్నంగా ఉన్నాయి. దీంతో ఎంత మెచ్చుకోగలదో, అంతే కంటే ఎక్కువ తిట్టగలను అని తన నోటి దురుసును చూపిన కొండా ఇప్పటి వరకు ఏపార్టీలో ఉన్నా కూడా ఆమెను కాస్థా కష్టంగానే భరించాయి ఆపార్టీలు.

అంతెందుకు ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసారన్న నెపం ఆమెకు దొరికిపోయి బతికిపోయింది గాని నేడోరేపో అన్నట్టుగానే ఆమె పరిస్థితి వైఎస్సార్ సిపి లో నెలకొందన్నది అందరికి తెలిసిందే. ఇదంతా అయిపోయిన వ్యవహారం. ఇప్పుడామే సున్నం వేసిన తన కార్యాలయానికి ఏరంగు వేస్థుందన్నదే అందరి ముందున్న ప్రశ్న. ఏరంగు వేసుకున్నాకూడా ఆమెను ఆరంగుపార్టీ చాలాకాలం భరించడం మాత్రం కష్టం అనే వాదనే రాజకీయవర్గాల్లో వ్యక్థం అవుతోంది.

మొదట్లో ఆమె కాంగ్రేస్ పార్టీలోకి చేరుతుంది అనుకున్నారు, అయితే కాంగ్రేస్ తెలంగాణపై ప్రకటన చేస్థున్న నేపథ్యంలో ఇంకా నేతలకోసం పాకులాడాల్సిన పని లేదని, పైగా జగన్ తో చేరి సోనియాను బండబూతులు తిట్టిన సురేఖ ఎంట్రీకి కాంగ్రేస్ నో చెప్పిందనే వార్థలు వినిపిస్థున్నాయి. అయితే అంతకు ముందునుంచే సురేఖను బిజేపి చేర్చుకోవడానికి సిద్దమైంది, ఈ విషయం పసిగట్టిన టిఆర్ఎస్ కూడా సురేఖను వలలో వేసుకోవడానికి మంతనాలు జరిపింది. అయితే తాజాగా ఆజాబితాలోకి  తెలుగుదేశం కూడా చేరడం ఆసక్థిగా మారింది.

వరంగల్ జిల్లాకు చెందిన ఓటిడిపి ఎమ్మెల్యే ఈమేరకు సురేఖతో మంతనాలు ప్రారంభించినట్టు సమాచారం. కారణం కడియం వెల్లిపోవడంతో మాట దురుసు, మాస్ పవర్ ఉన్న సురేఖ తెలుగుదేశం కు లాభిస్థుందని, కడియం కరెక్టుగా బుద్ది చెబుతుందన్న భావన అక్కడి టిడిపి లో నెలకొంది. సరే సురేఖ ఎటు పోతుంది, ఎవరికి గుదిబండలా తయారవుతుంది, లేక నిజంగానే ఓ మంచి కొండలాంటి అండగా నిలుస్థుందా అన్నది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: