క్రిందపడ్డా మాదే పైచేయి గుణపాఠం నుండి ఙ్జానం నేర్వని చైనా తలతిక్క వాగుడు

డోకలాం సంఘటనల నేపద్యము లో చైనా కవ్వింపు చర్యలకు దాని మైండ్-గేం రాజకీయాలకు లవలేశం కూడా భారత్ తన సంయమనం కోల్పోకుండా ప్రవర్తించి దౌత్యపరంగా తన సమర్ధతతో సమస్యను పరిష్కరించింది. దీంతో 70 రోజుల ఇరు సైన్యాల "ఫేస్ టు ఫేస్ స్టాండాఫ్" అనే ప్రతిష్ఠంభనకు తెరదించుతూ చైనా తన సేనలను ఉపసంహరించుకోడానికి అంగీకరించినట్లు విదేశాంగశాఖ సోమవారం ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే.




అయితే చైనా మాత్రం తన తీరు మార్చుకోవడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. అలా అంగీకరిస్తే దాన్ని చైనా అని ఎలా అనగలం. సరి కదా! స‌రిహ‌ద్దులోని ఏర్పడిన‌ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త సైన్యం డోకలాం నుంచి వైదొలగాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పద్దని ఇన్ని రోజులూ చైనా తనకు లేని, సాధ్యం కాని పనిని వదిలేసి మూటాముల్లె సర్దుకొని వైదొలగినా గాంభీర్యాన్ని మాత్రం ప్రదర్శించకుండా వదల్లేదు.

అయితే దీనికి భారత్ వెంట్రుక వాసిగానైనా స్పందించలేదు. మున్ముందుగా మీరు అక్కడ నుంచి వెళ్లిపోవాలని బాధ్యతగా సూచించింది. తమ కుతంత్ర వ్యూహం బెడిసి కొట్టడంతో డ్రాగన్ చైనాకు చివ‌ర‌కు నక్షత్రాలు కనపడగా వెన‌క్కి త‌గ్గి ఇరు సైన్యా లు ఒకే స‌మ‌యంలో అక్క‌డినుంచి వెళ్లిపోవాల‌నే సూచ‌న‌ను ఒప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే నిన్న అంటే సోమవారం డోక్లాం నుంచి తమ నిర్మాణ సరజామా బుల్డోజ‌ర్లు, రోడ్డు నిర్మాణయంత్రాలను చైనా వెన‌క్కు తరలించింది. అయినా సరే చైనా త‌మ‌దే పైచేయి అనేలా తాజాగా ప్ర‌వ‌ర్తించింది.  





"భారత్‌-చైనా ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా ఆర్మీ ఇకనుంచి ఎంతో అప్రమత్తంగా ఉంటూ తమ జాతీయ ప్రాదేశికతను, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుతుంది"  అని కియాన్‌ అన్నారు. "ఈ ప్రతిష్టంభన నుంచి పాఠాలు నేర్చుకోవలసిందిగా మేం భారత్‌కు గుర్తుచేస్తున్నాం"  అంటూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. అంతేకాదు చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (PLA) కి చెందిన సీనియర్ అధికారి  "హ్యూ కున్"  మీడియాకు సమాచారమిస్తూ త‌మదేశ సార్వ‌భౌమాధికారా న్ని కాపాడుకు నేందుకు స‌రిహ‌ద్దుల్లో త‌మ ఆర్మీ సాధారణంగా చేసే గ‌స్తీ నిర్వ‌హిస్తూనే ఉంటుంద‌ని అన్నారు.




అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా స‌రిహ‌ద్దుల్లో శాంతి పూరిత వాతావ‌ర‌ణం కొనసాగడానికి తాము కృషిచేస్తూనే ఉంటామ‌ని తెలిపారు. ఈ విషయంలో భారత్ సైన్యంతో తాము కలిసి పనిచేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని తెలియ జేశారు.  సెప్టెంబరు 3 నుంచి 5 వరకు చైనాలో జ‌రగబోయే బ్రిక్స్ స‌మావేశానికి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హాజ‌రుకావాల్సి ఉన్న నేప‌థ్యంలో ఇరుదేశాల ఆర్మీ అధికారులు డోకలాం  విష‌య‌మై మ‌రోదఫా చ‌ర్చ‌లు జ‌రిపి తమ సైన్యాలను ఉప‌ సంహ‌రించుకున్నాయి. 





అసలు సంగతేంటంటే అతిత్వరలో అంటే 2018 తొలి త్రైమాసికం లో చైనా జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ  ఎన్నికలు జరగనున్న దరిమిలా, తన పరువుగంగలో కలిసే తరుణం ఆసన్నవటంతో జి జిన్-పింగ్ నరెంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించిన నిదానం మన విధానమన్న వైఖరికి, తమ మీడియా, తమ ప్రభుత్వ సైన్యాధికారుల మైండ్- గేం కు ఇసుమంతైనా చలించ కపోవటం అంతర్జాతీయంగా విస్తరించిన భారత్ వ్యూహాత్మక దౌత్య సంభందాలకు బయపడ్డ చైనా విషయం బయటకు కనిపించనీయకుండా జాగ్రత్తపడుతూ తమ సైన్యమేదో డోకలాంలో ఉద్దరించినట్లు తమ ప్రజలకు కనిపించినట్లు బిల్డప్ ఇచ్చిందని తెలుస్తుంది. అసలు భారత్ అన్నా మోడీ అన్నా చైనాకు అనేక విధాలుగా భయమని స్పష్టంగా తెలుస్తుంది. అంతా ఆయుధ సామాగ్రితో యుద్ధం గెలవటం సాధ్యం కాదని చైనా ఇరుగుపొరుగు దేశాలతో భారత్ తాజాగా నెలకొల్పుకున్న స్నేహ, దౌత్య, వ్యాపార, రాజకీయ, ఆయుధ సరపరా సంభంధాలకు జడుసుకుందని అందుకే డొకలాం నుంచి తనసైన్యాన్ని ఉపసంహరించుకుని పరువు కాపాడుకుంది.      



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: