నిజంగానే దెయ్యం భయంతో వణికిపోతున్న హీరోయిన్..!?

Chakravarthi Kalyan
ఇటీవల తెలుగులో హార్రర్ కామెడీ సినిమాలు బాగా వస్తున్నాయి. నిర్మాణ వ్యయం తక్కువ.. కలెక్షన్లు ఎక్కువ.. అంతేకాదు.. ఈ సినిమాకు మినిమమ్ గ్యారెంటీ ఉంటోంది. ఈ సినిమాల సీరిస్ లో ప్రారంభంలోనే వచ్చిన సినిమా గీతాంజలి. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి గుర్తుందా.. గీతాంజలిలో దెయ్యంగా ఆమె అదిరిపోయేలా యాక్ట్ చేసింది. 


ఐతే.. ఇప్పుడు అదే హీరోయిన్ నిజం దెయ్యం భయంతో వణికిపోతోందట.. ఔను.. ఇదేదో సినిమా కథ కాదు.. నిజంగానే హీరోయిన్ అంజలిని దెయ్యం వేధిస్తోందట. ఆ భయంతో ఆమె ఇల్లు కూడా మారిందట. ఈ విషయంపై ఇటీవల టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. హీరోయిన్ అంజలి గచ్చిబౌలిలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. 



అంజలి అపార్ట్ మెంట్లోంచి విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయట. పిల్లులు కూడా ఎక్కవగా తిరుగుతున్నాయట. ఈ శబ్దాల గోల రాత్రి  సమయాల్లోమరింత ఎక్కువగా ఉంటోందట. దీంతో దిక్కుతోచని అంజలి ఇల్లు ఖాళీ చేసి మరో నివాసం వెదుక్కుందట. సినిమాల్లో దెయ్యంగా నటించిన హీరోయిన్ ను నిజం దెయ్యాలు భయపెట్టాయా.. లేక అంజలి భయపడిపోయిందా.. ఏదేమైనా ఇల్లు మారింది మాత్రం నిజమేనట.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: