ఆపరేషన్ ఏపికాంగ్రేస్ : ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్యనిపుణులు

ఒకటి కాదు రెండుకాదు లెక్కకు మించి వ్యాధులు సోకి విషమపరిస్థితుల్లో రాష్ట్రకాంగ్రేస్ అంపశయ్యపైకి చేరింది.ఇన్నాళ్లు ఎన్నో చికిత్సలు చేసినా వ్యాదులు ముదురుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. దీంతో శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపికాంగ్రేస్ ను హైదరాబాద్ లోని గాంధీభవన్ ఆసుపత్రికి తరలించారు. సోకిన వ్యాదుల పరిశీలన డాక్టర్ వాయలార్ రవి మొదట చేయనున్నారు.ఒక్కోవ్యాదికి ఒక్కో చికిత్సచేయడమా,అన్నింటికి కలిపి నయం చేయవచ్చా అన్నది పరిశీలించాక మరో వైద్యనిపుణులు డాక్టర్ ఆజాద్ వస్తారు.ఎందుకంటే ఈయన చాలా కాలం ఏపికాంగ్రేస్ కు ఫ్యామిలిడాక్టర్ గా ఉన్నారు.అవినీతి,అక్రమాలు,నిందితులుగా మారిన మంత్రులు, పార్టికి విలన్లుగా మారిన మంత్రులు,పార్టీ నేతలు, తెలంగాణ సమస్య,సిఎం,పిసిసి మద్యరగడ,కోవర్టులు ఇలా ఎన్నో క్లిష్టమైన వ్యాదులకు చికిత్సచేయాల్సి ఉంది. ఈవ్యాదులు సోకి కొన్ని అవయవాలు పనికి రాకుండా పోయినట్లు ఇప్పటికే వైద్యులు గుర్తించారట, వీటికి చికిత్స కన్నా మార్చి కొత్తవి పెట్టాలని కూడా నిర్ణయించారట. ఇది చెడిపోయిన భాగాలను భయపెడుతోందని సమాచారం. కొత్త అవయవాలు కూడా చాలా ఉన్నప్పటికి వీటిలో స్టాండర్డ్ కంపెనీవి ఏవో అన్నదికూడా ఈఢిల్లీ వైద్యులు పరీక్షించి మార్చడానికి సిఫార్సు చేస్తారట.ఎంతో కాలంగా శాశ్వత చికిత్సకోసం ఎదురుచూస్తున్న రాష్ట్రకాంగ్రేస్ దానికి నోచుకోబోతోంది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్........అన్నది త్వరలో తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: