ఫోర్జరీ సంతకాలతో 'ఈఐఏ' నివేదికను రూపొందించిన సీఆర్‌డీఏ అమరావతి





రాజ్యాంగ వ్యవస్థలు ప్రభుత్వాలకు తానే తందానా అన్న చందంగా వ్యవహరిస్తే ఇక రాజ్యాంగ చట్టం ప్రకారం రాజ్యాంగంలో బాగమైన న్యాయ అధికార వ్యవస్థలపై శాసన సభ గుత్త పెత్తనం ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేటు తెస్తుంది. శాసనసభ చట్టాలు చేయటానికి మాత్రమే. వాటిని అమలు చేసే భాధ్యత అధికార వ్యవస్థదే. అయితే చట్ట సభలు నిర్దేశించిన శాసనాలు అమలు లో ఏర్పడే వైరుధ్యాలను న్యాయశాస్త్రం ప్రకారం నిర్వచించే అమలుకు సానుకూలత అందించి అమలుకు సహకరించే బాధ్యత న్యాయ వ్యవస్థ తీసుకుంటుంది. అలా ఉండవలసిన చోట ఈ మధ్యకాలములో అధికారుల చేతివాటం అవినీతి బలహీనతల కారణంగా శాసనసభ ద్వారా అధికారములోకి వచ్చే ప్రభుత్వాలకు పప్పెట్ అవటం వలన ప్రభుత్వం లోని పెద్దల దౌష్ట్యం జాతి జనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. 




ఉదాహరణకు:

*దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాద ఉదంతం. ట్రావల్స్ యాజమాన్యాన్ని రక్షించటంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద 20 మంది మరణించిన సందర్భంగా ప్రజలకు తోడుగా నిలవటములో లేదు. ఇందులో జిల్లా వైధ్యాధికారి నుండి జిల్లా పోలీస్ యంత్రాంగం చివరకు జిల్లా కలక్టర్ వరకూ అందరూ ప్రజలకు నష్ఠం చేయటానికి తలా ఒక చేయ్యి వేసినవారే. 


*అలాగే ఏర్పేడు లారీ ప్రమాద దుర్ఘటనలో 15 మందికి పైగా ప్రజలు మరణించినా అధికార వ్యవస్థ ప్రణుత్వం పాటిలోని ప్ర్ద్దలైన ఇద్దరు నాయుళ్ళ సంరక్షణకే అధిక ప్రాఢాన్యత నిచ్చినట్లు, ఆ తరవాత పోలీస్ అధికారిని, ఆ యుద్దరు టిడిపి నాయకులను ఇతరులను ప్రభుత్వం తన మానాన్ని కాపాడుకునేందుకు సస్పెండ్ చేయటం తో అందులోని కుట్రకోణం అధికారుల చెయూత బట్టబయలైంది.

అయితే రాజధాని నిర్మాణం ఒక తప్పుల కుప్ప, లోపాల పుట్ట అనె దానికి ఈ క్రింది కదే ఉదాహరణ.  

  
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ  (సీఆర్‌డీఏ) జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ను (ఎన్జీటీ),  కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించింది.  ఫోర్జుడ్ గా భావించే సంత కాలతో "ఎన్విరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్"  (ఈఐఏ)  నివేదికను తయారు చేసి, పర్యావరణ అనుమతులు సంపాదించింది. సీఆర్‌డీఏ ఏర్పడకముందే పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తయారైనట్లు, ఫోర్జ్డ్ సంతకం కింద వేసిన తేదీలు స్పష్టం చేస్తున్నాయి. 





ఫోర్జుడ్ లేదా దొంగ సంతకానికి స్పష్టమైన ఆధారాలు


సీఆర్‌డీఏ చట్టానికి (యాక్ట్‌ నం.11, 2014) గవర్నర్‌ 2014 డిసెంబర్‌ 29న ఆమోదం తెలిపారు. ఆ తర్వాతి రోజు, అంటే 2014 డిసెంబర్‌ 30న సీఆర్‌డీఏ ఏర్పాటైంది. రాజధాని ఏర్పాటు వల్ల పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాన్ని అధ్యయనం చేసి, దానిన తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయడానికి "టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌" (టీసీఈ)కు బాధ్యత అప్పగించారు. 


2015 మే 1 నుంచి ఆగస్టు 30 వరకు, నాలుగు నెలలపాటు టీసీఈ  రాజధాని ప్రాంతంలో పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేసింది. తన నివేదికను సెప్టెంబర్‌ 4 న సీఆర్‌డీఏకు సమర్పించింది. నివేదికలో పేర్కొన్న అన్ని అంశాలకు టీసీఈ బాధ్యత వహిస్తుందని, వాస్తవిక అంశాలతో దీన్ని రూపొందించామని నివేదిక ప్రారంభంలోనే టీసీఈ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఆశీష్‌ దేశ్‌పాండే సంతకం చేశారు. ఆ బృందములోని 10 మంది నిపుణుల పేర్లు కూడా రాశారు. ఆ 10 మందిలో ఆశీష్‌ దేశ్‌ పాండే కూడా ఒకరు. 

 





నివేదికలో రెండు చోట్ల ఆశీష్‌ దేశ్‌పాండే సంతకం కనిపిస్తోంది. రెండు చోట్లా సంతకం కింద ‘28/07/2014’ అని తేదీ వేశారు. అధ్యయనమే 2015 మే 1 ప్రారంభమైంది. నివేదికను సెప్టెంబర్‌ 4న సీఆర్‌డీఏకే సమర్పించారు. మరి సీఆర్‌డీఏ పుట్టకముందు తేదీ ఎందుకు వేశారు?


ఎక్కడో ఉన్న పాత సంతకాన్ని కాపీ చేసి, ఈ నివేదికలో సీఆర్‌డీఏ అధికారులు ‘పేస్ట్‌’ చేశారు. వాస్తవంగా టీసీఈ రూపొందించిన నివేదికలో నిపుణులు సంతకాలు చేయకుండా, కాపీ చేసి పేస్ట్‌ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? టీసీఈ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు స్పష్టమవుతోంది.మిగతా నిపుణుల సంతకాలైనా నిజమైనవేనా? అవి కూడా ఫోర్జరీ చేశారా? ఆయా సభ్యుల సంతకాల కింద ‘4 సెప్టెంబర్‌ 2015’ అని తేదీ ప్రింట్‌ చేసి ఉంది. సంతకాల కింద తేదీ ప్రింట్‌ చేయాల్సిన అవసరం ఏమిటి?





జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు కూడా ఫోర్జుడ్ / దొంగ సంతకాలతో కూడిన నివేదికను సమర్పించడం గమనార్హం. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇదే నివేదిక అంద జేశారు. టీసీఈ ఇచ్చిన అసలైన నివేదికలో ప్రతికూలఅంశాలు ఉండటం వల్ల పర్యావరణఅనుమతులు రావని, హరిత ట్రిబ్యునల్‌ నుంచి వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉందన్న భయం తోనే దాన్ని బుట్టదాఖలుచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు అధికారులు ఫోర్జరీ సంత కాలతో నివేదికను రూపొందించారనే అనుమానాలున్నాయి.


ఫోర్జరీ సంతకాలతో ఈఐఏ నివేదికను రూపొందించిన సీఆర్‌డీఏపై కేసు పెడతానని ప్రభుత్వానికి వ్యతిరేకంగా "గ్రీన్‌ ట్రిబ్యునల్‌" లో పిటీషన్‌ దాఖలు చేసిన శ్రీమన్నారాయణ చెప్పారు.  నివేదిక మూడో పేజీలో కమిటీ నిఫుణుడు ఆశిష్‌ దేశ్‌పాండే  (టీసీఈ,  డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌) సంతకాన్ని ‘పేస్ట్‌’ చేసినట్లు కనిపిస్తున్న దృశ్యం. 





సీఆర్‌డీఏ - ఉన్నతాధికారులు ప్రభుత్వములోని పెద్దలతో చేతులు కలపటం వలననే కదా ఈ దొంగ వ్యవహారం నడిచింది. లేకుంటే పరిస్థితులు మరోలా ఉండేదేమో? అధికారులు స్వతంత్రంగా వ్యవహరించేందుకే రాజ్యాంగం అధికార వ్యవస్థను రాజ్యాంగములో మూడో మూల స్థంభం చేసింది.  అందుకే ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఇప్పటికైనా స్వతంత్రంగా వ్యవరిస్తే తప్ప భారత ప్రజలకు మేలు జరగదు. రాజ్యాంగములో పొందుపరచినట్లు ఈ వ్యవ్వస్థలు ప్రవర్తించనంతవరకు ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఈ అవస్థలు తప్పవు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: