
లైవ్ అప్ డేట్స్ : కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు - 2013
PARTY | WON |
Cong | 121 |
BJP | 40 |
JDS | 40 |
KJP | 6 |
Others | 16 |
1,బిజేపి కి చెందిన మాజి ముఖ్యమంత్రి సదానంద గౌడ ఓటమి పాలయ్యారు.
2, బెంగ్లూర్ సిటీలో బిజేపి 10, కాంగ్రేస్ 10 స్థానాలు గెలుచుకోగా ఇతరులు అయిదు చోట్ల విజయం సాధించారు.
3, న్యాయశాఖ మంత్రి ఎస్.సురేష్ కుమార్ రాజాజినగర్ నుంచి విజయం సాధించారు.
4, మాజి ముఖ్యమంత్రి అజయ్ సింగ్ గుల్బర్గా నుంచి గెలుపొందారు.
5, గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
6, బిఎస్సార్ కాంగ్రేస్ నుంచి పోటి చేసిన నటి పూజాగాంధి రాయచూర్ నుంచి ఓడిపోయారు.
7, ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉంచాలనుకుంటే వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం అని జెడిఎస్ అధినేత హెచ్.డి.కుమారస్వామి అన్నారు. రమనాగారం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఆయన సతీమణి అనితకుమారస్వాబి ఓటమి పాలయ్యారు.
8, అవీనీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజి ముఖ్యమంత్రి , బిజేపి బహిష్కృత నేత యడ్యూరప్ప శికారిపూర్ నుంచి 15 వేల మెజార్టీతో గెలుపొందారు.
9, ముఖ్యమంత్రిని నిర్ణయించేది అధిష్టానమే, ఉపముఖ్యమంత్రి ని వారం రోజుల్లో అధిష్టానం నిర్ణయిస్థుంది అన్నారు కాంగ్రేస్ సీనియర్ నేత సిద్దరామయ్య.
10, ఏపిలోను కర్ణాటక పలితాలు వస్తాయని పిసిసి చీఫ్ బొత్స వాఖ్యానించారు. గాంధీ భవన్ లో సంబరాలు జరుపుకున్నారు.
11, కన్నడ జనతా పార్టీ పెట్టి తాను కోలుకోకుండా దెబ్బతిన్న యడ్యూరప్ప అటు ఓట్లను చీల్చి తనతో పాటు బిజేపి ని నిలువునా ముంచారు.
12, కర్ణాటక ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటి తో కాంగ్రేస్ విజయం సాధించింది. అధికారానికి సొంతంగా 113 స్థానాలు అవసరం కాగా 121 స్థానాలు గెలిచి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దమయింది.
13, బిజేపి కేవలం 40 స్థానాలతో సరిపెట్టుకుంది. జెడిఎస్ సైతం 40 స్థానాలను దక్కించుకోగా, కన్నడ జనతా పార్టీ పెట్టిన యడ్యూరప్ప కేవలం ఆరింటిని మాత్రమే సొంతం చేసుకుని దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. స్వతంత్రులు 16 మంది గెలిచారు.