ఎవరైనా అప్పు గా సొమ్ము తీసుకుంటే భరోసా కోసం ఏం చేస్తారు. ప్రాంసరీ నోటు రాయించుకుంటారు. నోటుతోనే నమ్మడం కష్టం అనుకుంటే.. బ్లాంకు చెక్కులు ష్యూరిటీగా తీసుకుంటారు. లేకపోతే హామీదారుల దగ్గర సంతకాలు తీసుకుంటారు. ఇవేమీ కావంటే అప్పు తీసుకున్న సొమ్ముకు సరిపడా ఏదైనా వస్తువు తనఖా పెట్టమని కోరతారు.
ఐతే.. ఇవన్నీ రొటీన్ విషయాలు. చైనాలోని ఓ సంస్థ వెరైటీగా ఆలోచించింది. ఇలాంటి రొటీన్ వస్తువులు కాకుండా.. రుణం తీసుకునేవారి నగ్నఫోటోలను తనఖా పెట్టుకుంటోంది. అమ్మాయిలకు మాత్రమే రుణాలివ్వడానికి మొగ్గు చూపే ఈ సంస్థ.. వారి నగ్నచిత్రాలను తాకట్టు వస్తువులుగా అడుగుతోంది.
ప్రత్యేకించి లేడీ స్టూడెంట్స్ ను టార్గెట్ చేసిన ఈ సంస్థ న్యూడ్ ఫోటోలు తాకట్టు పెడితే.. మామూలుగా ఇచ్చే రుణం కంటే ఐదు రెట్లు ఇస్తామని ఆశ చూపుతోందట. ఈ సంచలన విషయాలను బీజింగ్ యూత్ డైలీ అనే పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ వ్యవహారాలపై ఇప్పుడు చైనా సర్కారు మండిపడుతోందట. ఈ దారుణాలపై విచారణ చేయిస్తోంది.
అమ్మాయిల నగ్నత్వాన్ని, శీలాన్ని పణంగా పెట్టుకునే విష సంస్కృతి ఆ మధ్య ఏపీలో కాల్ మనీ పేరుతో వెలుగు చూసిన విషయం తెలిసిందే. సొమ్ము కట్టలేకపోతే.. వ్యభిచారం చేయమని ప్రోత్సహించే నీచ సంస్కృతి ఇది. అభివృద్ధి చెందిన చైనాలాంటి దేశంలోనూ ఇలాంటి నీచ సంస్కృతి వెలుగు చూడటం విశేషమే.