అసెంబ్లీలో చెలరేగిపోయిన బాలకృష్ణ.. !

Chakravarthi Kalyan
నందమూరి బాలకృష్ణ హిందూపూరం ఎమ్మెల్యేగా ఎన్నికైనా అసెంబ్లీలో కనిపించేది తక్కువే. అందులో అసెంబ్లీలో మాట్లాడేది ఇంకా తక్కువ. అలాంటి మహిళాదినోత్సవం రోజు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చెలరేగిపోయారు. తాను ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలపై అంతటా నిరసన వ్యక్తమవుతున్న వేళ నిండు సభలో వివరణ ఇచ్చుకున్నారు. 

తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరుతూనే అసలు తాను మాట్లాడింది ఏమాత్రం తప్పు కాదని సమర్థించుకున్నారు. పేరుకు క్షమాపణలు చెబుతున్నట్టు కనిపించినా ఆయనలో పశ్చాత్తాప భావం ఏ కోశానా కనిపించలేదు. సరికదా.. తాను మాట్లాడిందే కరక్టు అనే కోణంలో సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకున్నారు. అదే వేదికపై తాను మహిళ గొప్పదనాన్ని పొగిడానని గుర్తు చేసుకున్నారు. 

అయినా తాను మాట్లాడిన దాన్ని ఆ సభలో అంతా ఎంజాయ్ చేశారని మహా గొప్పగా సెలవిచ్చారు బాలకృష్ణ. అంతే కాదు.. తన కామెంట్లకు అక్కడున్న హీరోయిన్లు ఇబ్బంది పడ్డారన్న మాట అవాస్తవమని.. అసలు వారిలో చాలా మందికి తెలుగే రాదని బ్రహ్మ రహస్యం గుట్టువిప్పేశారు. తన కామెంట్లను ఆ సభలో ఎవరూ తప్పబట్టలేదని వాదించుకున్నారు. 

మధ్యలో ఎవరో సభ్యులు మాట్లాడబోతే.. బాలయ్య హేయ్.. ఉండూ.. అంటూ కసురుకున్నారు. తన సినిమాల్లో మహిళలను గౌరవిస్తానని.. అసలు ఆ కామెంట్ల గురించి ప్రతిపక్షానికి చెందిన కొందరు ఏమనుకుంటున్నారో ముఖ్యం కాదని.. జనం ఏమనుకుంటున్నారో.. ఎలా స్వీకరించాలో అనేదే ముఖ్యమని చెప్పుకొచ్చారు. 

మొత్తానికి క్షమాపణ చెప్పే పేరుతో.. తన మాట్లాడింది తప్పే కాదంటున్న బాలయ్య ఇంతకూ క్షమాపణ చెప్పినట్టా.. కాదా.. అర్థం కాక జుట్టుపీక్కున్నారు మిగిలిన ఎమ్మెల్యేలు. దటీజ్ బాలయ్య. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: