పవన్‌కు జగన్ అంటే అంత కోపం ఎందుకంటే?

Chakravarthi Kalyan
రాజకీయంగా చంద్రబాబు నాయుడికి వైఎస్ జగన్ కు విరోధం ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ వెళ్లిన సమయంలో సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సాయం చేసి జగన్ జైలుకు వెళ్లేలా చేశాడని చంద్రబాబు పై  ఆరోపణలు వచ్చాయి.  జగన్ జైలుకెళ్లి వచ్చినా పార్టీని ఒంటి చేత్తో నడిపించాడు. 2014 లో 65 ఎమ్మెల్యే స్థానాలు, 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి చంద్రబాబుకు వైఎస్ కు, ఇప్పుడు చంద్రబాబుకు, జగన్ కు రాజకీయంగా విబేధాలు ఉన్నాయి. కానీ పవన్ కల్యాణ్ కు జగన్ అంటే ఎందుకు కోపం అని చాలా మందికి తెలియడం లేదు. బహిరంగ వేదికలపై ఎప్పుడు మాట్లాడిన జగన్ ను గద్దె దించాలని అనుకుంటున్నామని, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెబుుతుంటారు. అసలు విషయం ఏమిటంటే 2009 లో ప్రజారాజ్యం పెట్టిన సమయంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ ఉన్నారు.

అప్పుడు  కాంగ్రెస్ నాయకులు, వైఎస్ రాజశేఖర రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంచలూడే దాకా తరిమి కొడతాం అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో పవన్ కు బెదిరింపు కాల్స్ చాలానే వచ్చాయి. వందల కాల్స్ చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చేవని తెలుస్తోంది.
విదేశాలకు వెళ్లిన కూడా పవన్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి. చివరకు సిమ్ కార్డులు మార్చారు.

బాడీగార్డులను కూడా విడిచిపెట్టి ఏకాంతంగా ఉన్నా బెదిరింపు కాల్స్ ఆగేవి కావని తెలిసింది. దీంతో పవన్ కు సన్నిహితుడు ఒకరు చెప్పిన విషయం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడికి విదేశీ కాల్స్ నుంచి నార్మల్ కాల్స్ కు మార్చే ఐఎస్ఓడీ కంపెనీ ఉందని ఇది మొత్తం జగన్ చేస్తున్నారని తెలిసింది. అప్పటి నుంచి జగన్ అంటే పవన్ కు కోపం అని చర్చ నడుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: