కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ లోని కాంగ్రెస్ కు కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఒక ఊపును తీసుకొచ్చాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు.  భట్టి విక్రమార్క ఒక వైపు పాదయాత్ర చేస్తుంటే.. మిగతా సీనియర్లు రాహుల్ గాంధీని కలిసి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లు వార్తలు వినిపించాయి.

తెలంగాణలో ని కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కావాలనే కోరుకోవడం పార్టీని గతంలోనే దెబ్బతీసింది. కర్ణాటకలో అలా లేదు. కేవలం ఇద్దరి మధ్య పోటీ ఉండటం. ప్రజలకు బీజేపీ అనుసరించిన విధానాలను చెబుతూనే.. గెలిస్తే ఏమేం పథకాలు ఇస్తామో అని కచ్చితంగా హామీ ఇవ్వడం లాంటి ప్రణాళికలు పక్కాగా అమలు చేశారు. ప్రస్తుతం రేవంత్ కు సంతోషకరమైన వార్త. ఇప్పటి వరకు గెలవలేం అని ఉన్న కార్యకర్తలకు మంచి జోష్ వచ్చింది.

బీజేపీ తెలంగాణలో పుంజుకోవడం, కాంగ్రెస్ ను కేసీఆర్ దెబ్బతీయడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడం తదితర కారణాలతో రాష్ట్రంలో హస్తం పార్టీ వెనకబడింది. హిమచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు తెలంగాణలో ఇంత ఊపు రాలేదు. కానీ పక్కన ఉన్నరాష్ట్రం కర్ణాటకలో గెలవడంతో ధైర్యం వచ్చింది. ఇక కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదు. అలాగే సీఎం కేసీఆర్ కూడా మూడు పార్టీల మధ్య పోటీ జరిగితే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు.

కాంగ్రెస్ కర్ణాటకలో ప్రకటించినట్లుగానే ఇక్కడ కూడా సంక్షేమ పథకాల హామీలను ఇచ్చి అధికారంలోకి రావాలని అనుకుంటోంది. యువత, మహిళల కోసం మళ్లీ ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెడతామని హామీలతో ప్రజల్లోకి వెళ్లి గెలవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. మొన్నటి వరకు ఢీలా పడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కర్ణాటక ఫలితాలు ఇక్కడ ఆశ రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్సే విజయం సాధిస్తామని నమ్మకం పెరిగిందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: