హైదరాబాద్ : టీఆర్ఎస్ కు రు. 15 కోట్ల ముడుపులా ? నమ్మచ్చా ?

Vijaya
బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కు 2020లోనే తాను రు. 15 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు మనీల్యాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపున తాను స్వయంగా హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ఆఫీసుకు వచ్చి పై ముడుపులను అందించినట్లు సుఖేష్ చెప్పారు. కేజ్రీవాల్ ను ఉద్దేశించి సుఖేష్ జైలునుండి రాసిన లేఖను విడుదల చేశారు.ఈ రు. 15 కోట్లను అందించేందుకు కేజ్రీవాల్ తనకు 15 కిలోల నెయ్యి అనే కోడ్ భాష ను కేటాయించినట్లు సుఖేష్  చెప్పారు. హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో పార్క్ చేసిన రేంజి రోవర్ కారులో 15 కేజీల నెయ్యిని ఉంచినట్లు తన లేఖలో వివరించారు. చాలాకాలంగాగా జైలులోనే ఉంటున్న సుఖేష్ గతంలో ఎప్పుడూ తాను టీఆర్ఎస్ కు ముడుపులు చెల్లించినట్లు చెప్పలేదు. మొదటినుండి తాను కేజ్రీవాల్ కు మాత్రమే ముడుపులు చెల్లించినట్లు చెబుతున్నారంతే.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుఖేష్ పైన మనీల్యాండరింగ్ తో పాటు చాలా కేసులున్నాయి. వీటిల్లో నుండి బయటపడటం అంత ఈజీకాదు. సుఖేష్ పైన ఉన్న కేసులను సీబీఐ, ఈడీ లాంటి సంస్ధలు దర్యాప్తు చేస్తున్నాయి. కేసుల్లో నుండి తాను బయటపడేందుకు సుఖేష్ ఎంతకైనా తెగిస్తాడనే ప్రచారం ఉంది. ఇప్పటికే తాను ఇరుక్కున్న కేసుల్లో బాలీవుడ్ ప్రముఖులను చాలామంది ఇరికించేశారు. అలాగే రాజకీయ నేతల పేర్లను కూడా విచారణలో అప్పుడొకటి ఇప్పుడొకటిగా చెబుతున్నారు. అసలు రు. 15 కోట్లను సుకేష్ నుండి తీసుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఏముంది ?అంటే తన కేసులో ఎంతమంది ప్రముఖులను ఇన్వాల్వ్ చేస్తే తాను అంత సేఫ్ గా ఉండొచ్చని సుఖేష్ ఆలోచనగా అనిపిస్తోంది. ప్రముఖులు ఇన్వాల్వ్ అయిన కేసులేవీ అంత తొందరగా తెమిలేవి కావు. కాబట్టి కొంతకాలం జైలులోనే హ్యాపీగా ఉండి ఆ తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసే ఉద్దేశ్యంలో సుఖేష్ ఉన్నాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనింటికి, హోటల్ గదికి, తీహార్ జైలుకి సుఖేష్ పెద్దగా తేడా ఏమీలేదట. అందుకనే జైలులోనే హ్యాపీగా గడిపేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: