అమరావతి : చంద్రబాబు ఏమీ మారలేదా ?

Vijaya


చంద్రబాబునాయుడు తాను మారానని ఇప్పటికి వందసార్లు చెప్పుంటారు. కానీ ఆయన మనస్ధత్వంలో ఎలాంటి మార్పు రాలేదని తమ్ముళ్ళు గొణ్ణుకుంటున్నారు. మారాను అని చెప్పటం మాత్రమే కానీ నిజంగా చంద్రబాబులో మార్పు రాలేదని తమ్ముళ్ళకు అర్ధమైపోయింది. సందర్భంవచ్చినప్పుడల్లా తెలుగుదేశంపార్టీ నాయకులను తయారు చేసుకుంటుందని చెబుతుంటారు కానీ ఏమీ తయారు చేసుకోదు పక్క పార్టీల నుండి చేర్చుకుంటుందనేదే కరెక్టని మరోసారి రుజువైపోయింది.ఇపుడు విషయం ఏమిటంటే బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. ఈయనకు వచ్చేఎన్నికల్లో ఎక్కడో ఒకచోట నుండి పోటీచేయటానికి టికెట్ ఇవ్వాలి. అంటే ఆ మేరకు పార్టీలో ఇప్పటివరకు సదరు నియోజకవర్గంలో కష్టపడిన నేతలు ఏమైపోవాలి ? అలాగే థర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరి మళ్ళీ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. చంద్రబాబుకు మాజీ ఎంఎల్ఏ వరదాపురం అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళని తెలుసు. కాబట్టి పార్టీలోకి రీ ఎంట్రీ అంటేనే అక్కడ టికెట్ సూరికి గ్యారెంటీ అనే అనుకోవాలి. మరి నాలుగేళ్ళుగా కష్టపడుతున్న పరిటాల శ్రీరామ్ ఏమవ్వాలి ?ఇక జమ్మలమడుగులో కూడా మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి తొందరలోనే బీజేపీని వదిలేసి టీడీపీలో చేరబోతున్నారంటు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే టికెట్ హామీతోనే కదా పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన నేతలు ఏమైపోతారు ? పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న మాజీ తమ్ముళ్ళు ఇంకా ఎంతమందున్నారో తెలీదు.ఇలాంటి రీ ఎంట్రీ నేతల వల్ల పార్టీలో పాతవాళ్ళతో  గొడవలవ్వటమే కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అధికారంలో ఉన్నపుడూ పక్క పార్టీల నుండి నేతలను తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడూ పక్కపార్టీల నేతలే దిక్కా అని తమ్ముళ్ళు మండిపోతున్నారు. చూస్తుంటే చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టంగా అర్ధమైపోతోంది. 2014లో కాంగ్రెస్ నుండి వచ్చిన నేతలకే ఎక్కవ ప్రాధాన్యతిచ్చారు. 2019లో వైసీపీ నేతలకు ఇంపార్టెన్సిచ్చారు. మరి 2024 ఎన్నికల్లో ఏమిచేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: