అమరావతి : గన్నవరం ఇష్యూ వెనక ఇంత ప్లానుందా ?

Vijaya



గన్నవరం కేంద్రంగా జరుగుతున్న గొడవను చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. అనుమానం ఎందుకు వచ్చిందంటే సోమవారం వైసీపీలో 18 మంది ఎంఎల్సీల ప్రకటన వచ్చే సమయానికే కాస్త అటు ఇటుగా గన్నవరంలో టీడీపీ ఆఫీసుమీద దాడి అనే గోల మొదలైంది. ఎంఎల్సీ అభ్యర్ధులుగా మెజారిటి బీసీలనే జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారనే వార్తలు మూడు నాలుగు రోజులుగా ప్రచారంలో ఉంది. సోమవారం మధ్యాహ్నం జాబితాను విడుదల చేయబోతున్నారనే విషయం ఆదివారం నుండే ప్రచారంలో ఉంది.



సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సజ్జల రామకృష్ణారెడ్డి జాబితాను విడుదల చేస్తారని ఉదయం నుండే ప్రచారం జరిగింది. సజ్జల ఎంఎల్సీల జాబితాను విడుదల చేసే సమయానికి గన్నవరంలో గొడవలు మొదలయ్యాయి. అంటే ఎంఎల్సీలుగా జగన్ బీసీలకు పెద్దపీట వేశారనే విషయం మరుగున పడిపోవటం కోసమే వ్యూహాత్మకంగా టీడీపీ గన్నవరంలో గొడవలను సృష్టించిందా అనే అనుమానం పెరిగిపోతోంది. దీనికి ఆధారంగా ఎంఎల్సీల జాబితాలో బీసీలకే పెద్దపీట అన్న విషయం జగన్ సొంత మీడియాలో తప్ప ఎల్లోమీడియాలో ఎక్కడా కనబడలేదు.



ఎల్లోమీడియాలో ఎంఎల్సీల జాబితాను ప్రకటించారని మొక్కుబడిగా వార్త వచ్చిందే కానీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కనబడలేదు. మామూలుగా అయితే ఇదే విషయమై అనుకూలంగానో వ్యతిరేకంగానో ఛానళ్ళల్లో డిబేట్లు కూడా పెట్టుండాల్సింది. కానీ సోమవారం సాయంత్రం నుండి మంగళవారం రాత్రివరకు ఎల్లోమీడియాలో కేవలం గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి, పట్టాభి కిడ్నాప్, విచారణలో చచ్చేట్లు కొట్టారనే వార్తలు, కథనాలనే బాగా హైలైట్ చేశారు. 



అంతకుముందు రెండు రోజులు అనపర్తిలో చంద్రబాబు-పోలీసుల గొడవలనే హైలైట్ చేశారు. గన్నవరం గొడవ లేకపోతే ఎంఎల్సీల జాబితాపై చర్చలు జరపాల్సొచ్చేది. అందుకనే బీసీలకు ప్రాధాన్యత అన్న విషయం హైలైట్ కాకుండా ఉండటం కోసమే కావాలనే గన్నవరం ఇష్యూని టీడీపీ టేకప్ చేసిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  వాళ్ళ ప్లాన్ కు తగ్గట్లే ఎంఎల్సీల జాబితా, బీసీలకు పెద్దపీట అన్నది కేవలం జగన్ మీడియాలో తప్ప ఇంకెక్కడా కనబడలేదు. అందుకనే అనుమానాలు పెరిగిపోతున్నది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: