ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్..?

Purushottham Vinay
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అలాగే పెన్షనర్లకు చక్కటి శుభవార్త. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాల్లో డీఏ ఇంకా డీఆర్‌లను పెంచే ఛాన్స్ ఉంది.ఈ మేరకు డీఏ పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా కూడా ఎంతగానో డిమాండ్ చేస్తున్నారు.ఇక హోలీ పండుగకు ముందే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం తెలుస్తుంది.మార్చి 1 వ తేదీన కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగనుంది. అప్పుడు డీఏ పెంపు నిర్ణయాన్ని కూడా ఆమోదించవచ్చు.ఇక ఇలా డీఆర్‌ను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కనీస భత్యం DA, DR డియర్‌నెస్ రిలీఫ్ అనేది పెన్షనర్లకు అందించబడిన ఓ చక్కటి సౌకర్యం అని చెప్పాలి. ఇక కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఉద్యోగులకు సంవత్సరానికి రెండుసార్లు పెంచుతుంది. గత సంవత్సరం జనవరి ఇంకా జూలైలో డీఏ, డీఆర్‌లను పెంచారు. ఈ సంవత్సరం జనవరి నెలలో డీఏ పెరుగుతుందని కూడా భావించారు.


అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది.గత నెల నుంచి కూడా డీఏ పెంపుపై కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే ప్రస్తుతం మాత్రం కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2022 లో డీఏను 4 % పెంచడం జరిగింది. ఇప్పుడు 48 లక్షల మంది ఉద్యోగులు 38శాతం DA ని పొందుతున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా DA 4 శాతం పెంచి కేంద్ర ఉద్యోగులకు కనీస భృతిలో 42 శాతం ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఇంకా ఈ గ్రాట్యుటీ పెరిగినప్పుడు, జీతం కూడా సహజంగా పెరుగుతుంది. ఇక DR పెంపు అనేది ఖచ్చితంగా పెన్షనర్లకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏకంగా 68 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మొత్తం 68 లక్షల మంది రిటైర్డ్‌లుగా ఉన్నారు.ఈ డీఆర్‌ పెంపు వల్ల వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది.ఇక ప్రస్తుతం కేంద్రంలోని ఉద్యోగులు 7వ వేతన సంఘం ప్రకారం వేతనాలని పొందుతున్నారు. ఇక ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం కూడా అమలు కావచ్చని వస్తున్నాయి. అయితే ఈ బడ్జెట్‌లో ఎనిమిదో వేతన సంఘాన్ని ఇంకా ప్రతిపాదించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: