అమరావతి : మంత్రివర్గంపై జగన్ సంచలన నిర్ణయం ?

Vijaya



తొందరలోనే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయబోతున్నారా ? మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. తొందరలోనే 14 ఎంఎల్సీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో తొమ్మిది స్ధానాలను స్ధానికసంస్ధల కోటాలోను, మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల కోటాలో మిగిలిన రెండు టీచర్ల నియోజకవర్గాల కోటాలో ఎంఎల్సీలు భర్తీ అవబోతున్నాయి. తొమ్మిది స్ధానికసంస్ధల కోటాలో భర్తీ అవబోయే స్ధానాలన్నీ వైసీపీ ఖాతాలోనే పడటం ఖాయం.



ఈ నేపధ్యంలోనే ఈనెలలోనే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఇపుడున్న మంత్రుల్లో ఐదుగురిని తప్పించి కొత్తగా ఎంఎల్సీలవబోయే వారితో భర్తీ చేస్తారనే ప్రచారం బాగా పెరిగిసోతోంది. నిజానికి ఇపుడున్న 25 మంది మంత్రుల్లో కొందరి కెపాసిటిపై చాలా అనుమానాలున్నాయి. వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో కనీసం వాళ్ళకైనా అర్ధమవుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక శాఖాపరమైన సమీక్షలు కూడా చేసినట్లు కనబడటంలేదు.



కాబట్టి అలాంటివారిని తప్పించి కొత్తగా ఎంఎల్సీలవబోయే వారితో భర్తీ చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇపుడు కొత్తగా ఎంఎల్సీలు అవబోయే వారిలో ఒకళ్ళిద్దరికి ఎప్పుడో మంత్రివర్గంలోకి తీసుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ ను ఎంఎల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని చాలాకాలం క్రితమే జగన్ బహిరంగంగా ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల మంత్రిపదవి కాదు కదా చివరకు ఎంఎల్సీ కూడా దక్కలేదు.



అలాంటి రాజశేఖర్ కు ఇపుడు ఎంఎల్సీ పదవి దక్కబోతోందని పార్టీలో బాగా టాక్ వినబడుతోంది. ఇదిగనుక నిజంగానే జరిగితే ఇచ్చిన మాట నిలుపుకున్నట్లవుతుంది. అలాగే గట్టివారిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటారట. ఎలాగూ ఎన్నికల సంవత్సరమ కాబట్టి కాస్త గట్టివాళ్ళని, మాట్లాడేవాళ్ళని తీసుకుంటే ఇబ్బందులు ఉండవని జగన్ అనుకుంటున్నారట. అందుకనే తొందరలోనే మంత్రివర్గం ప్రక్షాళన ఉంటుందనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే. దీంతో ఒక సమస్య కూడా ఉంది. అదేమిటంటే అసంతృప్తులు బయటపడే అవకాశం కూడా ఉంది. ఈ విషయం తెలిసే జగన్ ప్రక్షాళనకు ఆలోచిస్తున్నారంటే ఏదో వ్యూహం ఉండే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: