అమరావతి : టీడీపీకి అంత ధైర్యం కూడా లేదా ?

Vijayaమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై తెలుగుదేశంపార్టీ విడుదలచేసిన ఒక పుస్తకం తాజాగా వివాదాస్పదంగా మారింది. రెండురోజుల క్రితం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అండ్ కో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన పుస్తకాన్ని విడుదలచేశారు. ‘జగనాసుర రక్త చరిత్ర’ అనే పేరుతో రాసిన పుస్తకావిష్కరణలో అచ్చెన్న తదితరులు జగన్ పై అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇపుడా పుస్తకంపైనే వివాదం ముసురుకున్నది.పుస్తకంలోని కంటెంట్ ఏమిటి అనే విషయమై చర్చలు అనవసరం. ఎందుకంటే దీనిపై సీబీఐ విచారణ చేస్తోంది, కొందరిని అరెస్టులు కూడా చేసింది. హత్య ఘటనపై హైకోర్టు విచారణ జరుపుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే టీడీపీ మాత్రం వివేకా హత్యకు జగనే సూత్రదారని తేల్చేసింది. జగన్ కు తెలిసే వివేకా హత్య జరిగిందని బల్లగుద్దకుండానే చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.విశాఖపట్నమే రాజధాని అవుతుందని ఢిల్లీలో జగన్ అనగానే టీడీపీ అంతెత్తున ఎగిరిపడింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై జగన్ ఎలా మాట్లాడుతారని లాజిక్ లేవదీసింది. పైగా జగన్ పై కేసు నమోదుచేయాలని సుప్రింకోర్టుకు టీడీపీ ఫిర్యాదు కూడా చేసింది. మరి వివేకా హత్య కేసు విచారణలో ఉండగా టీడీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారు . స్వయంగా చంద్రబాబునాయుడే కొన్ని వందలసార్లు వివేకా హత్యలో జగనే కీలక పాత్రదారంటు చెప్పుంటారు.ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే జగన్ పై టీడీపీ విడుదల చేసిన పుస్తకాన్ని రాసిందెవరు ? ముద్రించిందెవరు ? అన్న వివరాలు కూడా లేవని మాజీమంత్రి పేర్నినాని ఎద్దేవాచేశారు. జగన్ పై తాము చెబుతున్నదంతా నిజమే అని అనుకుంటే పుస్తకాన్ని రాసిన వాళ్ళ పేరు, ప్రింట్ చేసిన ప్రెస్ వివరాలు ఎందుకు లేవు ? పుస్తకాన్ని రిలీజ్ చేసినపుడు రచయితను పరిచయం చేయటం మామూలే కదా. ఆ పని టీడీపీ ఎందుకు చేయలేదు. ఈ విషయంలో  పేర్ని ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెబుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: