సియోల్ : కిమ్ సైన్యంలో డేంజరస్ జాంబీలా ?

Vijaya




ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. తన స్ధూలకాయం, విచిత్రమైన హైర్ కట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే కిమ్ అలవాట్లు, అనుమానాలు, ప్రత్యర్ధులను డీల్ చేసే విధానం, వేసే శిక్షలపై ఇప్పటికే చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రపంచానికి పెద్దన్నగా పెత్తనం చెలాయించాలని అనుకుంటున్న అమెరికానే చాలెంజ్ చేస్తున్న కిమ్ అంటే సానుకూలంగా ఉండే దేశాలు చాలానే ఉన్నాయి.



అమెరికాను ఢీకొట్టేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త  క్షిపణులను, వార్ హెడ్లతో పాటు రకరకాల ఆయుధాలను తయారుచేసి పరీక్షిస్తుంటారు. ఈమద్య కిమ్ ప్రయోగించిన ఒక మిస్సైల్ జపాన్లో పడినపుడు దేశం ఎంతగా ఉలిక్కిపడిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇలాంటి కిమ్ తన సైన్యంలో అత్యంత ప్రమాదకరమైన జాంబీలను రిక్రూట్ చేసుకున్నారనే వార్త ప్రపంచంలో వైరల్ గా మారిపోయింది. దక్షిణకొరియాతో ఏమాత్రం పడని కిమ్ ఈమధ్యనే తన సైనిక సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటడానికి పెద్దఎత్తున కవాతు చేయించారు.



పరేడ్ లో అత్యంత శక్తివంతమైన ఆయుధాలను, క్షిపణలను ప్రదర్శించి తమతో పెట్టుకుంటే ఎవరైనా సరే మటాషే అనేట్లుగా వార్నింగులు పంపించారు. అయితే సైనిక పరేడ్ లో చాలా యూనిట్లు పాల్గొన్నప్పటికి ఒకే ఒక యూనిట్ మాత్రం యావత్ ప్రపంచదృష్టిని ఆకర్షించిందట. ఆ యూనిట్ ఏమిటంటే జాంబీస్ అని అంటున్నారు. జాంబీలంటే అందరికీ తెలిసిందే. మనుషులను పీక్కుతినే వాళ్ళని జాంబీలంటారు. ఈ జాంబీల అంశంపై ఇప్పటికే చాలా సినిమాలు కూడా వచ్చాయి.



తాజాగా ఉత్తరకొరియా సైన్యం కవాతులో ఇలాంటి జాంబీలతో ప్రత్యేకించి కిమ్ ఒక యూనిట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ జాంబీ యూనిట్లో సుమారు 10 వేలమంది ఉన్నట్లు చెబుతున్నారు. ఈ యూనిట్లోని సైనికులు మొహానికి రంగు పూసుకుని, ఒంటిపై గడ్డి కప్పుకున్నట్లుండే డ్రస్ వేసుకుని, చేతిలో అత్యంత ఆధునిక ఆయుధాలను పట్టుకుని పరేడ్ చేశారు. అప్పుడు తీసిందే పైనున్న ఫొటో. సైనిక పరేడ్ సమయంలోనే ఉత్తరకొరియా జనాలకు కూడా ఈ జాంబీ యూనిట్ గురించి తెలిసిందట. మరి ఈ యూనిట్లోని జాంబీలు కూడా సినిమాల్లో చూపించే జాంబీల్లాగే ఉంటారా లేదా అన్నది ఇంకా క్లారిటి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: