హైదరాబాద్ : బీజేపీకి కేటీయార్ కరెక్టు ఫిట్టింగ్ పెట్టారా ?

Vijaya





రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటు కొద్దిరోజులుగా నానా రచ్చచేస్తున్న బీజేపీ నేతలకు కేటీయార్ కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ మొదలుకుని చాలామంది నేతలు ముందస్తు ఎన్నికలు ఖాయమని , బీజేపీ అధికారంలోకి రావటం తథ్యమంటు నానా గోలచేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని, అవసరమూ లేదని కేసీయార్ స్వయంగా చెప్పినా కమలనాదులు మాత్రం వినకుండ గోలగోల చేస్తున్నారు.



దాంతో ఇదే విషయమై నిజామాబాద్ పర్యటనలో మంత్రి కేటీయార్ గట్టి రిప్లై ఇచ్చారు. అదేమిటంటే పార్లమెంటుకు నరేంద్రమోడీ ముందస్తు ఎన్నికలకు రెడీ అయితే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు తామూ రెడీ అంటు చాలెంజ్ విసిరారు. లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరిపించే ధైర్యం మోడీకి ఉందా అంటు బీజేపీ నేతలను కేటీయార్ సూటిగా నిలదీశారు. మంత్రి ప్రశ్నకు సమాధానం చెప్పలేక బీజేపీ నేతలకు నోళ్ళు పడిపోయింది.



దేశవ్యాప్తంగా మోడీ పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోంది. వచ్చేఎన్నికల్లో పార్లమెంటు సీట్లలో భారీ కోతుంటుందని మోడీ, అమిత్ షా లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాధిలో సీట్లు తగ్గిపోవటం ఖాయం కాబట్టే తగ్గుతుందని అనుకుంటున్న సీట్లను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలని రకరకాలుగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే దక్షిణాదిరాష్ట్రాలపై బాగా ఫోకస్ పెంచుతున్నారు. అయితే ఉత్తరాధిలో సీట్లు తగ్గినంత వేగంగా దక్షిణాదిలో భర్తీకావు.



ఎందుకంటే మొత్తం దక్షిణాదిలో కర్నాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తూ పోతోంది. మిగిలిన తెలంగాణా, ఏపీ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలో పార్టీకి దిక్కేలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో మాయచేసి పాండిచ్చేరిలో అధికారంలోకి వచ్చిందంతే. ఈ విషయాలన్నింటిని క్షణ్ణంగా తెలుసు కాబట్టే పార్లమెంటుకు మోడీ ముందస్తు ఎన్నికల ఆలోచనే చేయటంలేదు. ఇప్పటికిప్పుడు కేసీయార్ గనుక ముందస్తు ఎన్నికలంటే బీజేపీ కుదేలైపోవటం ఖాయం. ఈ విషయాలు తెలుసుకాబట్టే కేటీయార్ పెట్టిన ఫిట్టింగుకు బీజేపీ సమాధానం చెప్పలేకపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: