రాయలసీమ : 3వ రోజుకే ఇంత అన్యాయమైపోయిందా ?

Vijaya
తెలుగుదేశంపార్టీకి అనదికారికంగా అధినేతగా నారా లోకేష్ చెలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం కుప్పంలో పాదయాత్ర సందర్భంగా అందరికీ అర్ధమైపోయింది. చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోనే కూర్చుని పార్టీలోని సీనియర్లందరు హాజరయ్యేట్లు ప్లాన్ చేయటంతో అందరి దృష్టంతా లోకేష్ మీద మాత్రమే హైలైటైంది. దీంతో ఎల్లోమీడియా బాగా హైప్ చేసింది.  అందుకనే యువగళం పాదయాత్ర మొదటిరోజు ఆహాఓవో అన్నట్లుగా కనిపించిన జనం బహిరంగసభలో కనబడలేదు.బహిరంగసభలోనే పెద్దగా జనం కనబడలేదు కాబట్టి రెండోరోజు యాత్రలో  పలుచగా కనిపించారు. ఇక మూడోరోజు ఆదివారం పాదయాత్రలో దాదాపు జనాలు లేరనే చెప్పాలి. మొదటిరోజు, రెండోరోజు కూడా పార్టీ జనాలే కానీ మామూలు జనాలు పెద్దగా లేరు. ఇక మూడో రోజైతే పార్టీజనాలు కూడా లేరు. లోకేష్ వ్యక్తిగత భద్రత+వాలంటీర్లు మొత్తం కలిపి 30 మంది కనిపించారు. వీరిని తీసేస్తే పార్టీ జనాలు మరో 40 మందుంటారు. అంటే మూడోరోజు పాదయాత్రలో మొత్తం జనాలు కనిపించింది 70 మంది కూడా లేరంటేనే ఆశ్చర్యంగా ఉంది.
దాదాపు ఏడాదినుండి లోకేష్ పాదయాత్రంటు ఒకటే ఊదరగొట్టి కొట్టి చివరకు చినబాబుతో కలిసి నడిచిన పార్టీ జనాలు సుమారు 40 మంది మాత్రమేనా ? పాదయాత్రలో పార్టీ జనాలు కాకుండా మామూలు జనాలు కనిపించినపుడే కదా నిండుదనం వచ్చేది. పార్టీ జనాలు, సెక్యూరిటి, వాలంటీర్లు మాత్రమే పాదయాత్రలో పాల్గొనేట్లయితే లోకేష్ ఇక పాదయాత్ర ఎందుకు చేయాలి. కొన్నిచోట్ల కనిపించిన జనాలు మరికొన్ని చోట్ల కనిపించకపోవటం ఆశ్చర్యంగా ఉంది.
ఉద్యమం అయినా, బహిరంగసభలైనా, ఆందోళనలు, పాదయాత్రలైన మామూలు జనాల భాగస్వామ్యం లేకుండా ఏదీ సక్సెస్ కాదన్న విషయం చంద్రబాబుకు తెలీదా ? పాదయాత్ర సాగుతున్న గ్రామాల్లోని జనాలైనా లోకేష్ దగ్గరకు వచ్చేట్లు పార్టీ నేతలు ప్లాన్ చేసుకోవాలి కదా. పాదయాత్ర బ్రహ్మాండమని డప్పుకొట్టేందుకు  ఎలాగూ ఎల్లోమీడియా ఉన్నపుడు మామూలు జనాలను కొంతమందినైనా తీసుకొస్తే ఇంకా ఎక్కువ డప్పుకొట్టేందుకు అవకాశం ఉండేదికదా. మొత్తానికి మూడోరోజే  పాదయాత్రలో లోకేష్ డల్లుగా కనిపించి మామూలు జనాలు కనబడకపోతే ఇంకా 397 రోజుల యాత్ర ఎలా సాగాలి ? టీడీపీ ఏమైపోవాలి ?  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: