లోకేష్ పాదయాత్ర మొదటిరోజే అలా జరగడం బాధాకరం !

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి ఇదే ఆఖరి ఎన్నిక కావచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు మరియు ఇతర సీనియర్ నాయకులు అంతగా ప్రభావం చూపించకపోవడం, పైగా చంద్రబాబు వయసు మీద పడుతుండడం కారణంగా ప్రజలలో అంత నమ్మకం కలగడం లేదు. ఒకవేళ చంద్రబాబు తర్వాత టీడీపీకి అధినాయకత్వం వహించే నాయకుడెవరు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఎన్టీఆర్ వస్తే తిరుగులేదు.. కానీ ఎన్టీఆర్ ఇప్పుడల్లా రాజకీయాల వైపు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీనితో చంద్రబాబు నాయుడు లోకేష్ ను ప్రజలు మెచ్చే నాయకుడిగా తీర్చి దిద్దాలన్న ఉద్దేశ్యంతో తనతో పాదయాత్రను చేయించడానికి నిర్ణయం తీసుకున్నాడు.
అందులో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుండి యువగళం అనే పేరుతో నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ పాదయాత్ర గురించి రాష్ట్రంలో బాగా మైలేజ్ వచ్చింది. కాగా ఎంతో నమ్మకంతో మొదలు పెట్టిన ఈ యువగళం యాత్రలో మొదటిరోజే అపశృతి చోటుచేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పాలి. నందమూరి తారకరత్న కూడా ఈ యువగళం పాదయాత్రలో పాల్గొన్నాడు.. ఈ పాదయాత్రకు మద్దతుగా పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రావడంతో ఒక్క్కసారిగా తారకరత్న అస్వస్థకు లోనయ్యి పడిపోయాడు.
దీనితో వెంటనే అప్రమత్తం అయిన కార్యకర్తలు ఆయనను కూపంలో మెడిసిల కాలేజీ లో అడ్మిట్ చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం తారకరత్న గుండెకు ఎడమవైపు దాదాపు 90 శాతం వరకు బ్లాక్ అయినట్లు బాలకృష్ణ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం బెంగుళూరు లోని మణిపాల్ హాస్పిటల్ లో చికిత్సను అందిస్తున్నారు. మరి శుభమా అంటూ మొదలు పెట్టిన ఈ పాదయాత్ర ఆదిలోనే హంస పాదు లాగా ఇలా జరగడం ఏమిటని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: