అమరావతి : అమల్లోకి జీవో 1..ఎల్లో గ్యాంగ్ కు షాక్ ?

Vijayaమంగళవారం నుండి జీవో 1 అమల్లోకి వస్తుండటంతో మొత్తం ఎల్లోగ్యాంగుకు నోళ్ళు పడిపోయినట్లున్నాయి. జీవో 1 సస్పెన్షపై   చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలను ఎల్లోమీడియా ఎక్కడా రిపోర్టు చేయలేదు. ఇక టీడీపీ నేతలైతే అసలు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు తమకు తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే జీవో 1పై హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ చేశారు. ఈ సందర్భంగా వెకేషన్ బెంచ్ వైఖరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.రోడ్డుషోల పేరుతో రోడ్లపై సభలు పెట్టడాన్ని ప్రభుత్వం నిషేధిస్తు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వును సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో చాలెంజ్ చేశారు. సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా రెగ్యులర్ కోర్టు కాకుండా వెకేషన్ బెంచ్ పిటీషన్ను టేకప్ చేసింది. సీపీఐ వేసిన పిటీషన్ అత్యవసరమైనది కాదు కాబట్టి విచారించేందుకు లేదని అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెప్పినా బెంచ్ పట్టించుకోలేదు. పైగా ఉత్తర్వులను సస్పెండ్ చేస్తు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.దీనిపైనే చీఫ్ జస్టిస్ ఈరోజు తీవ్రంగా స్పందించారు. వెకేషన్ బెంచ్ తన పరిధి దాటి వ్యవహరించిందన్నారు. జీవో 1 అత్యవసరంగా విచారించాల్సిన కేసేమీ కాదన్నారు. వెకేషన్ బెంచ్ డిఫాక్టో చీఫ్ జస్టిస్ లాగ వ్యవహరించిందని మండిపోయారు. అత్యవసరం పేరుతో అన్నీ కేసులను వెకేషన్ బెంచే విచారిస్తే ఇక హైకోర్టు ఉన్నదెందుకని నిలదీశారు. పిటీషన్ గురించి, దాని మూలల గురించి తనకు బాగా తెలుసన్నారు.
వెకేషన్ బెంచ్ లో లంచ్ మోషన్ వేయటంపైన కూడా చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు విన్నతర్వాత మొత్తం ఎల్లోగ్యాంగ్ కు నోళ్ళు పడిపోయినట్లయ్యింది. జీవో 1 సస్పెన్షన్ను కంటిన్యు చేయటానికి చీఫ్ జస్టిస్ అంగీకరించలేదు. దాంతో రేపటినుండి జీవో 1 అమల్లోకి వచ్చేస్తోంది. చంద్రబాబునాయుడు కార్యక్రమాల వల్ల రెండు ఘటనల్లో 11 మంది చనిపోయిన కారణంగానే ఉత్తర్వులు జారీచేసినట్లు ప్రభుత్వం మొత్తుకున్నా వెకేషన్ బెంచ్ వినిపించుకోలేదు.  మరి విచారణ తర్వాత చీఫ్ జస్టిస్ తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: