ఉత్తరాంధ్ర : పవన్ ఎంఎల్ఏగా గెలుస్తారా ?

Vijaya



రాబోయేఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిపోవటం ఖాయమన్నారు నాగబాబు. పవన్ సోదరుడు కదా తమ్ముడిపై ఈ మాత్రం నమ్మకం లేకపోతే బావోదనుకున్నారో ఏమో. ఇంతకీ పవన్ సీఎం అవటానికి ఉన్న మార్గాలేమిటి అంటే మాత్రం నాగబాబు నోరులేవదు. అధికారంలోకి రావటానికి జనసేనకు అన్నీ అర్హతలు ఉన్నాయని మాత్రం సొల్లుచెప్పారు. పైగా జనసేనలో ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందంటున్నారు.



ఒకవైపు పవన్ సీఎం అవుతారని చెబుతునే మరోవైపు సీఎం అయ్యే అవకాశం జనసేనలో ఎవరికైనా ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇక్కడే నాగబాబులో గందరగోళం స్పష్టంగా బయటపడుతోంది. అయినా జనసేన ఒంటరిగా పోటీచేస్తుందో లేకపోతే టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందో కూడా చెప్పే ధైర్యం చేయటంలేదు పవన్. ఇక ముఖ్యమంత్రి ఎలాగ అయిపోతారో అన్న నాగబాబే చెప్పాలి. టీడీపీతో పొత్తుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుకు అవకాశం ఉంటుందే కానీ పవన్ కు రాదు.



అలాకాదని ఒంటరిగా పోటీచేస్తే సీఎం అవటం కాదు పవన్ ఎంఎల్ఏగా గెలవటం కూడా అనుమానమే. ఈ విషయం పవన్ కు బాగా తెలియటంతోనే టీడీపీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారు. అయినా పవన్ను సీఎంగా చూడాలని జనసైనికుల్లో ఉన్నంత కోరిక అసలు పవన్లో ఉందా అనే  అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎంతసేపు తాను సీఎం అవ్వాలనే కోరికకన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మాత్రమే పవన్ చెబుతున్నారు. పోనీ చెప్పింది చేయటానికి ఏమన్నా కార్యాచరణ రెడీ చేశారా అంటే అదీలేదు.



వారంలో ఒకసారి షూటింగుల గ్యాప్ లో వచ్చి నేతలతో సమావేశమో లేకపోతే బహిరంగసభో పెట్టటం, జగన్ ప్రభుత్వంపై బురదచల్లేయటం మళ్ళీ షూటింగులకు వెళ్ళిపోవటం. ఇలాంటి పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్న పవన్ కూడా సీఎం అయిపోవాలని ఆశపడుతున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు జగన్, చంద్రబాబు ఫుల్ టైమ్ రాజకీయాల్లోనే ఉంటుంటే పవన్ మాత్రం అతిధిపాత్ర పోషిస్తుంటే ఎలాగ ? పార్టీపైన జనసైనికులకు ఉన్నంత శ్రద్ధ కూడా పవన్లో కనిపించటంలేదు. ఇలాంటి తమ్ముడ్ని నాగబాబు సీఎంగా చూడాలని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: