వైసీపీని ఓడించడానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ !

VAMSI
ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రానున్న ఎన్నికలలో కష్టకాలం దాపురించి ఉంది అని చెప్పవచ్చు. దాదాపుగా రెండున్నరేళ్ల పాలన వరకు ప్రజలలో ఒకింత పాజిటివ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ.. ఈ మధ్యకాలంలోనే అన్ని వర్గాల ప్రజలలో వ్యతిరేకత మొదలైందని చెప్పాలి. అయితే ఇందుకు కారణాలు ఏమైనా వైసీపీకి అంత అనుకూలంగా అయితే లేదు. కానీ ఈ ప్రతికూలతను దారుకుని వెళ్లి మళ్ళీ గెలవాలని సీఎం జగన్ నాయకులను సమాయత్తం చేస్తున్నాడు. మరోవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితంలో మునుపెన్నడూ కష్టపడని విధంగా అహర్నిశలు 2024 ఎన్నికల గురించే ఆలోచిస్తూ వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు రచిస్తున్నాడు.
చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళితే వైసీపీ పై గెలవడం కష్టం అనుకున్నాడో ఏమో తెలియిదు. కానీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఇప్పుడిప్పుడే రాజకీయ అడుగులు వేస్తున్న జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి సిద్దమయ్యాడు. అయితే రాజకీయ విశ్లేషకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు అంతటితో ఆగకుండా కమ్యూనిస్ట్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే దిశగా ఇప్పటికే తెరవెనుక చర్చలు జోరుగా సాగుతున్నాయట.   ఇక కమ్యూనిస్ట్ లు కూడా గతంలో టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి  మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉన్నారట.
ఆ విధంగా 2024 ఎన్నికలలో టీడీపీ, జనసేన మరియు కమ్యూనిస్ట్ లు కలిసి జగన్ పైకి దండెత్తి వెళ్లనున్నారు. ఇక జగన్ మాత్రం ఎప్పట్లాగే ఒంటరిగానే త్రిదళ శత్రువులను ఎదుర్కోవడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ కూటమిలో భాగంగా ఉన్న 175 సీట్ లలో ఎవరికీ ఎన్నెన్ని కేటాయిస్తాడో బాబుకే తెలియాలి. మరి చంద్రబాబు సారధ్యంలోని ఈ మూడు పార్టీలు కలిసిన మాస్టర్ ప్లాన్ ద్వారా జగన్ పై విజయాన్ని సాధిస్తాయా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: