అమరావతి : చంద్రబాబుకు పాల్ స్ట్రైట్ క్వశ్చన్

Vijaya



ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏపాల్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే ‘తన కొడుకు, మనవడికి ఇలాగే జరిగితే చంద్రబాబు ఇలాగే సభలు పెడతారా’ ? చంద్రబాబును ఉద్దేశించి పాల్ ఈ ప్రశ్న అడగటానికి ఒక కారణముంది. ఇంతకీ ఆ కారణం ఏమిటంటే కందుకూరు బహిరంగసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే.



స్పాట్లోనే ఇద్దరు చనిపోతే ఆసుపత్రిలో మరో ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి దెబ్బలు తగిలాయి. అందరినీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఒకవైపు కొందరు చనిపోయారని, మరికొందరికి దెబ్బలు తగిలాయని ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉంది. చంద్రబాబు కూడా తన వెహికల్ దిగి స్పాట్ కు వచ్చారు. అయితే అందరు కలిసి ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత చంద్రబాబు మళ్ళీ తన వాహనంపైకి ఎక్కారు. అక్కడి నుండి మాట్లాడుతు తాను ఆసుపత్రికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తానని, వచ్చిన మాట్లాడుతానన్నారు.



తాను వచ్చేంతవరకు ఎవరూ ఎక్కడికీ వెళ్ళద్దని మైకులో చెప్పి ఆసుపత్రికి వెళ్ళారు. ఒకవైపు తన సభలో అంతమంది చనిపోతే సభను కంటిన్యు చేయాలని చంద్రబాబుకు ఎలాగ అనిపించిందో అర్ధంకాలేదు. మామూలుగా ఇంకెవరైనా అయ్యుంటే సభను రద్దుచేసుకునే వారే. కానీ చంద్రబాబు మాత్రం సభను కంటిన్యుచేశారు. బహుశా పాల్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పై ప్రశ్న వేసుంటారు.



పాల్ ప్రశ్న వినటానికి కాస్త ఇబ్బందిగానే ఉన్నా అందులో వాస్తవముంది. ఇలాంటివి చంద్రబాబుకు కొత్తేమీకాదు. ముఖ్యమంత్రిగా ఉండగా గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాగ జరిగి 30 మంది చనిపోయారు. అప్పుడు కూడా బాధితులను ఎవరి ఖర్మానికి వాళ్ళని వదిలేసి కుటుంబంతో కలిసి అక్కడినుండి వెళ్ళిపోయారు. అసెంబ్లీలో తన భార్యను ఎవరో ఏదో అన్నారని తర్వాత ఎప్పుడో మీడియా సమావేశంలో వెక్కివెక్కి ఏడ్చారు గుర్తుందా ? మరిపుడు ఇంతమంది చనిపోయినా మొహంలో ఎందుకు పశ్చాత్తాపం కానీ బాధగానీ లేదని మంత్రులు చంద్రబాబును నిలదీస్తున్నారు. పాల్ కైనా లేదా మంత్రులకైనా చంద్రబాబు సమాధానం చెబుతారా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: