కోస్తా : నిజంగానే రాష్ట్రానికి ఇదేంఖర్మ ?

Vijaya



ఇదేం ఖర్మ...రాష్ట్రానికి కార్యక్రమం చివరకు చంద్రబాబునాయుడు మెడకే చుట్టుకునేట్లుంది. ప్రచార పిచ్చే చంద్రబాబును ఇంతస్ధాయికి దిగజార్చేసింది. నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది చనిపోవటానికి  అచ్చంగా టీడీపీ అధినేత ప్రచారపిచ్చే కారణమనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, కొన్ని సంఘటనలు మనచేతుల్లో ఉండవని చంద్రబాబు ఇపుడు వేదాంతం చెబుతున్నారు కానీ చనిపోవటానికి మాత్రం తానే కారణమని అర్ధమవుతోంది. 8 మంది మృతికి చంద్రబాబు ఎలాగ కారణమంటే తన ప్రచారపిచ్చేనట.



తన కార్యక్రమాలకు జనాలు విరగబడి హాజరవుతున్నారని చూపించుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్. ఏపనిచేసినా చాలా అట్టహాసంగా మొదలుపెట్టడం, ప్రత్యర్ధులపై బురదచల్లేయటం చంద్రబాబుకు మొదటినుండి ఉన్న అలవాటే. ఇందులో భాగంగానే కందుకూరులో బాగా ఇరుగ్గా ఉండే ఎన్టీయార్ సర్కిల్లో కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇక్కడే ఎందుకంటే వీధులన్నీ చిన్నవి కాబట్టి కొంతమందే హాజరైనా చాలా ఎక్కువగా వచ్చినట్లు కలరింగ్ ఇవ్వచ్చు.   ఈ కార్యక్రమం మొదలైనదగ్గర నుండి చంద్రబాబు సభలన్నీ రోడ్లపైనే జరుగుతున్నాయి.



ఇపుడు కందుకూరులో ఇలాగే పెట్టారు. అనుకోనిరీతిలో తొక్కిసలాగ జరిగి 8 మంది ఓపెన్ డ్రైనేజిలో పడి చనిపోయారు. ఈ 8 మంది చనిపోయింది తన ప్రోగ్రామ్ కు వచ్చి కాదని వాళ్ళ ఖర్మకాలే చనిపోయారని సమర్ధించుకుంటున్నారు. గతంలో గోదావరి పుష్కరాల మొదటిరోజు కూడా ప్రచారపిచ్చి వల్లే తొక్కిసలాట జరిగి  30 మంది చనిపోయారు. అప్పుడు కూడా వాళ్ళు చనిపోయింది తన వల్లకాదని సమర్ధించుకున్నారు.



ప్రతిరోజు ఎంతోమంది చనిపోతున్నారని, రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోవటంలేదంటు మీడియానే ఎదురు ప్రశ్నించారు. అంటే తన కార్యక్రమాల్లో పాల్గొని, తన ప్రచారపిచ్చి వల్ల ఎవరైనా చనిపోతే అదంతా వాళ్ళ ఖర్మ. అదే జగన్ కార్యక్రమాల్లో ఎవరికైనా ఏమైనా అయితే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అంటు గోలగోల చేసేస్తున్నారు. మొత్తానికి ఇరుకురోడ్లలో రడ్డుషోలు, సభలు నిర్వహించటం జనాలు తన సభలకు విరగబడి వచ్చేస్తున్నారంటు కలరింగ్ ఇచ్చుకోవటం చంద్రబాబుకే చెల్లింది. అంతేకానీ తన ప్రచారపిచ్చి వల్లే జనాలు చనిపోతున్నారని చంద్రబాబుకు అనిపించకపోవటం నిజంగా రాష్ట్రం చేసుకున్న ఖర్మనే అనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: