సీనియర్స్ కోసం పోస్టాఫీసు స్కీమ్..అధిక వడ్డీతో పాటు..

Satvika
25 నుంచి 35 ఏళ్ళ వయస్సు వాళ్ళు అయితే ఉద్యోగం చేస్తారు..వారికి పెద్దగా చింతన ఉండదు.. వయస్సు పెరిగే కొద్ది వృద్దులకు మాత్రం టెన్షన్ టెన్షన్ వుంటుంది..జీవితం పై భయం ,ఆందోళన ఉంటాయి.. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.. వయస్సు పై బడిన వారికి రోగాలు కూడా ఎక్కువగానే వస్తాయన్న విషయం తెలిసిందే.. అందుకే వాళ్ళు ఏ చిన్న విషయాన్ని చెప్పినా కూడా గాబరా పడిపోతారు.. ఇక వయస్సు పెరిగే కొద్ది శక్తీ కూడా తగ్గుతుంది..ఎ పని చెయ్యలెరు.. కష్టపడి పని చెయ్యలెరు..ఇది వాస్తవం..

అందుకే ఇప్పటి నుంచే పొదుపు చెయ్యడం చాలా ముఖ్యం..ఆ వయస్సులో బాగా జీవించాలి అంటే మాత్రం ఇప్పుడు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చెయ్యాలనుకోవాలి.. డబ్బులు సేఫ్ గా ఉండి, అధిక వడ్డీ ఇచ్చే పొదుపు పథకాల కోసం చూస్తున్నారా.. బ్యాంకులలొ డబ్బులు దాచుకోవచ్చు. కానీ అతి తక్కువ వడ్డీ వస్తుంది.ఇలాంటి వారికి కోసం పోస్టాఫీసు లో బెస్ట్ స్కీమ్ వుంది.కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఒకటి...60 ఏళ్లు పైబడిన ఎవరైనా రూ.1000 నుంచి రూ.15,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు..దీనికి సంబంధించిన పూర్తీ వివరాల కోసం దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్ళాల్సిందే..

ఇకపోతే సీనియర్ సిటిజన్ రూ.15 లక్షల ను ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టినట్లయి తే, ఆ సీనియర్ సిటిజన్ ప్రతీ మూడు నెలలకు రూ. 27వేల750 రూపాయల వడ్డీని ఆదాయంగా పొందొచ్చు. ఏడాదికి రూ. 1,11,000 వడ్డీ పొందుతారు. అంటే, ఐదేళ్ల మెచ్యురిటీ పీరియడ్ ముగిసిన తరువాత, ఆ వ్యక్తి రూ. 5,55,000ల మెచ్యూరిటీ అమౌంట్ ను పొందుతారు.. ఇక్కడ భార్యా భర్తలు ఇద్దరూ కూడా జాయింట్ అకౌంట్ ను తీసుకోవచ్చు..ఇలా అయితే 30 లక్షల రుపాయల వరకూ ఇన్వెస్ట్ చెయ్యొచ్చు..వారికి రూ. 2,22,000 వడ్డీ ఆదాయం వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: