వైసీపీని కూల్చి టీడీపీ గద్దెనెక్కుతుందా ?

VAMSI
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలలో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటిసారి ప్రతిపక్ష హోదాలో ఉన్నపటికీ.. వెనకడుగు వేయకుండా సమయం కోసం వేచిచూసి ఆ తరువాత జరిగిన ఎన్నికలలో అధికారంలో ఉన్న బలమైన టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించి జగన్ ఎంట్రుత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ యొక్క ఎత్తుగడలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తోకముడవక తప్పలేదు. ప్రజలకు ఏమి హామీలను చెప్పి అధికారంలోకి వచ్చాడో... అన్నింటినీ తూచా తప్పకుండా నెరవేర్చుకుంటూ సక్సెస్ ఫుల్ గా మూడు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్నాడు.
అయితే సగానికి పైగా నియోజకవర్గాలలో ఉన్న ప్రతిపక్ష నాయకులు వైసీపీ పాలనపైనే బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా అయినా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీ పాలనలోకి రావడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా ప్రధాన నియోజకవర్గాలలో బహిరంగ మీటింగ్ లను పెడుతూ ఓటర్లలో కదలికను తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంటే ప్రజలకు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరి సొంతం కానుందని ఆతృతగా ఉన్నారు. జగన్ కు ఈ ఎన్నికలు కఠిన సవాలు అని చెప్పాలి.
ఏపీలో ఉన్న టీడీపీ, జనసేన, సిపిఎం , బీజేపీలు వైసీపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్ ఏ విధంగా ప్రత్యర్థులను తిప్పికొట్టి అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటాడన్న విషయంపై సర్వత్రా ఉత్కంట నెలకొంది. అందులో భాగంగా ఇరు పార్టీల నేతలు ఎటువంటి రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటారో చూడాలి. మరి వైసీపీని కూల్చి టీడీపీ అధికారాన్ని దక్కించుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: