జయహో జగన్: ప్రజలు మెచ్చిన నాయకుడిగా చేసిన లక్షణాలివే ?

VAMSI
రాజకీయ కురుక్షేత్రంలో ఒక నాయకుడిగా ప్రజల ఆశీర్వాదం పొందడం అంటే ఆషామాషీ విషయం కాదు. ప్రజలకోసం మనము కష్టపడుతున్నాము , వారి కోసం మంచి చేస్తున్నాం అని వారు పూర్తిగా నమ్మితేనే మన పక్షాన నిలబడతారు. లేదంటే రాజకీయ జీవితం సంకనాకినట్లే. ఇలా ప్రజల మనసును గెలుచుకున్న చాలా మంది నాయకులలో ఒకరే దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈయనకు ఇద్దరు పిల్లలు .. ఒకరు కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాగా మరొకరు కూతురు వైఎస్ షర్మిల. ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన 50 వ వసంతాన్ని పూర్తి చేసుకుని 51 వ వడిలోకి అడుగుపెట్టాడు.
తండ్రి అకాల మరణం అనంతరం కడప ఎంపీగా ఉన్న జగన్ ఏకాకిగా మిగిలిపోయాడు. అయితే తండ్రి మరణవార్త విని కొన్ని గుండెలు తట్టుకోలేక ఆగిపోయాయి. అలాంటి వారిని ఓదార్చడానికి వెళ్లవలసిందిగా జగన్ కాంగ్రెస్ ను అడగ్గా.. అందుకు అధిష్టానం ఒప్పుకోకపోవడంతో ఎంపీ పదవికి మరియు పార్టీకి రాజీనామా చేసి... ఒంటరిగా ఓదార్పు యాత్రను మొదలు పెట్టాడు. ఆ తర్వాత సొంతంగా యువజన శ్రామిక రైతు పార్టీని స్థాపించి 2014 లో ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ పాదయాత్ర చేసి టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించి 151 ఎమ్మెల్యేలను గెలిపించుకుని సీఎంగా అధికారాన్ని దక్కించుకున్నాడు. ఈ మూడున్నరేళ్ల సంవత్సరాల కాలంలో ఎంతో పరిణితి చెందిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇంతకు ముందు ఏపీని ఎందరో సీఎంలు పాలించారు. కానీ ప్రజల సీఎంగా రాజశేఖర్ రెడ్డి తర్వాత రెండవ సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తండ్రి అందించిన పాలన తరహాలోనే అన్ని పథకాలను ప్రజలకు అందిస్తూ సంక్షేమమే పరమావధిగా ముందుకు వెళుతున్నాడు.
* నిజాయితీగా ఉండడం
* చెప్పిన మాటను నెరవేర్చడానికి ఎంతకైనా తెగించడం
* ప్రజల శ్రేయస్సు కోసం సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడని వైనం
* మంత్రివర్గ కూర్పులో సమానత్వం చూపడం
* బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం
* ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వంటి చాలా అంశాలు మరియు జగన్ లో ఉండే మంచి లక్షణాల వలన ప్రజలు మెచ్చిన సీఎంగా వెలుగొందుతున్నాడు.  
 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: