వణికిస్తున్న కరోనా..ఇండియాలో ఫోర్త్ వేవ్ డేంజర్ బెల్స్..

Satvika
కరోనా పేరు చెబితే జనాలకు గుండెల్లో వణుకు పుడుతున్న సంగతి తెలిసిందే.. ఎంతో మంది ప్రాణాల ను కొల్పొయారు.. చాలా మంది కరోనా బారిన పడి చనిపొయారు. అలాగే ఇప్పటికీ కూడా వ్యాక్సిన్ వున్నా కూడా ఇలా కేసులు పెరగడం పై జనాలు భయం తో వణికిపోతున్నారు... మరో నాలుగు నెలల్లో చైనాలో పది లక్షల మంది కోవిడ్‌ తో చచ్చిపోతారట. కోవిడ్ కేసుల విస్పోటనం పుట్టి… చైనాలో మూడో వంతు జనాభాకి ఇన్‌ఫెక్షన్ సోకుతుందట. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి నెల ఫస్టాఫ్‌ అంతా చైనా లో సెలవులు ప్రకటిస్తారు.

ఈ గ్యాప్‌లోనే ప్రయాణాలు, పబ్లిక్ గ్యాదరింగ్స్‌ పెరిగి… లక్షలాది మంది కరోనా వైరస్‌కి దొరికిపోతారు. టోటల్‌ గా ఏప్రిల్1లోగా మరణ మృదంగం పీక్స్‌కి చేరబోతోంది. కోవిడ్‌ ఆనవాళ్లే లేకుండా చేద్దాం… మన ఫ్యూచర్‌ ని మనమే కాపాడుకుందాం అంటూ జీరో కోవిడ్‌ గైడ్‌లైన్స్‌ పెట్టిన చైనా ఇప్పుడు యూటర్న్ తీసుకోక తప్పేలా లేదు. చైనాలో కోవిడ్‌తో ఇప్పటివరకు 5233 మంది చనిపోయారు. కానీ… జీరో కోవిడ్‌ గైడ్‌లైన్స్‌ లో కట్టుదిట్టం చేశాక… డిసెంబర్ 3 తర్వాత ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు..

ఇండియాలో అక్కడక్కడా మాత్రమే ఉనికి చాటుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ చీఫ్‌ మినిస్టర్ సుఖ్విందర్ కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం మన దేశంలో యాక్టివ్ కేసులు 3,559 మాత్రమే అని ఇవాళే ప్రకటించుకుంది హెల్త్ మినిస్ట్రీ. కానీ… చైనాలో ఫోర్త్‌ వేవ్‌ మొదలైతే.. ఆ ప్రభావం ఇండియా తో పాటు ఏషియన్ కంట్రీస్ మొత్తమ్మీద పడే ప్రమాదం ఉంది. ఇక్కడే చిన్న ఉపశమనం… మన వ్యాక్సిన్లు బలవర్థకమైనవి.. ఫోర్త్‌ వేవ్ వచ్చినా భయపడేంత ప్రమాదం ఏమీ ఉండదనే టాక్.. ఏది ఏమైనా కూడా మన జాగ్రత్తల్లో మనం వుంటే మంచిదని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: