సీఎం జగన్ మాట ఆ 32 మంది ఎమ్మెల్యేలు లెక్క చేయట్లేదా ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ రెండవసారి వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో పనిచేస్తోంది. అందుకు సీఎం జగన్ ఎమ్మెల్యే మరియు ఎంపీలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఎవరికి వారు తమ తమ నియోజకవర్గాలలో తిరిగి ప్రజలు మన ప్రభుత్వం గురించి ఏమి అనుకుంటున్నారు.. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పధకాలు వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకుని రిపోర్ట్ చేయవలసిందిగా గడప గడపకు మన ప్రభుత్వం అన్న ఒక కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి కారణం పార్టీలో ఉన్న నాయకులలో కొందరు ప్రజల వద్దకు అస్సలు వెళ్లడం లేదని, వారితో మమేకం కావడం లేదన్న కారణంతో ఇలా అయినా అందరూ ప్రజల మధ్యనే ఉంటారన్న అభిప్రాయంతో జగన్ తీసుకున్న మంచి నిర్ణయం పట్ల కొందరు మాత్రం తమ దారే తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారట. అప్పుడు తీసుకున్న సర్వే రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది ఎమ్మెల్యేలు ప్రజలతో సరిగా లేరని పనితీరు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసింది. కానీ తాజాగా మరోసారి సర్వే చేయించగా ఆ నెంబర్ కాస్త పెరిగిందని వార్తలు వస్తున్నాయి.
మొత్తం వైసీపీ తరుపున గెలిచిన 151 ఎమ్మెల్యే లలో 32 మంది వరకు ఇంకా పూర్తి స్థాయిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని అధిష్టానంలో చర్చ జరుగుతోంది. జగన్ మాటపై వారికి కాస్త అయినా గౌరవం మర్యాద లేదా అంటూ పొలిటికల్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీని ప్రజల్లో బలంగా చేయడానికి చేస్తున్న కార్యక్రమం పట్ల కనీసం గౌరవం లేని వారి పట్ల సీఎం జగన్ కోపంతో ఉన్నారట. మరి వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు దొరికే అవకాశం ఉంటుందా లేదా అన్నది చెప్పలేము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: