అమరావతి : పవన్ ఓవరాక్షన్ మామూలుగా లేదుగా ?

Vijaya


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. ఎప్పుడు చేస్తారో తెలీని పర్యటన కోసం ఇప్పటికే ఓ వెహికల్ ను రెడీ చేయించుకున్నారు. దానికి వారాహి అని పేరు పెట్టినట్లు ప్రెస్ రిలీజ్ లో చెప్పారు. ఆ వెహికల్ ట్రయల్ రన్ ను స్వయంగా పవనే పరిశీలించారు. అన్నీ దిక్కులను కాచే అమ్మవారి పేరు వారాహి అని వాహనానికి పేరుపెట్టినట్లు చెప్పారు. అంటే వెహికల్ పేరుకు పవన్ కు పోలికలు చెప్పినట్లే ఉంది. అమ్మవారి లాగే పవన్ కూడా నాలుగు దిక్కులను కాస్తున్నాడనో లేకపోతే కాచబోతున్నాడనో అర్ధమొచ్చేట్లుంది.వాహనంలోని ప్రత్యేకతలు, పనితీరు లాంటి విశేషాలను కూడా ప్రెస్ రిలీజ్ లో చెప్పారు. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిందేమంటే వెహికల్ ట్రయల్ రన్ ను జనసేన ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేశారు. ఆ పోస్టే చాలా ఓవర్ గా అనిపిస్తోంది. ట్రయల్ రన్నును ట్విట్టర్లో ఎలా చూపించారంటే అచ్చంగా సినిమా సీన్ లో చూపినట్లే చూపించారు.  దుమ్మురేపుతున్న రోడ్డు మీదకు హఠాత్తుగా అంటే స్లోమోషన్లో ఒక వెహికల్ ఎంట్రీ ఇస్తుంది. ఆ వెహికల్ కూడా మిలిట్రీ ట్రక్కులాగే ఉంటుంది.చాలా మెల్లిగా ట్రక్ వస్తుంటే దానికి రెండువైపులా ఓ 15 మంది కమేండోలు మిలిట్రీ డ్రస్సులో నడుస్తుంటారు. వెహికల్ పైన చెరోవైపు ఇద్దరు బాడీగార్డులు నిలబడుంటారు. బహుశా వెహికల్ ను కూడా పవనే నడిపినట్లున్నారు. వాహనాన్ని ఎవరు నడుపుతున్నారన్న విషయాన్ని మాత్రం క్లియర్ గా చూపలేదు.30 సెకన్ల వీడియోలో ట్రక్కుతో పాటు బాడీగార్డులు, కమేండోలంతా మిలిట్రీ యూనిఫారమ్ లాంటివి వేసుకుని కనిపించారు. అంటే జనాల రక్షణకే పవన్ వస్తున్నారనేట్లుగా కలరింగ్  ఇచ్చారు. ఇదంతా చూసిన తర్వాత ఇంత ఓవరాయక్షన్ పవన్ కు అవసరమా అనే కామెంట్లు మొదలయ్యాయి. ఎప్పుడు చేస్తారో తెలీని యాత్రకేనా ఇంత బిల్డప్ అంటు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: