ఉత్తరాంధ్ర : నారాయణ మాటలతో అయినా ప్రతిపక్షాలకు బుద్ధొస్తుందా ?

Vijaya


చాలా నెలలుగా విశాఖపట్నంలోని రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి. పర్యావరణాన్ని ధ్వంసం చేసేసి జగన్మోహన్ రెడ్డి భారీఎత్తున విల్లాలు కట్టుకుంటున్నాడని, విలాసవంతమైన నిర్మాణాలు చేసుకుంటున్నాడంటు గోలచేశారు. అప్పటికి జగన్ సొంతంగా కొండను కబ్జాచేసేసి నిర్మాణాలు చేసుకుంటున్నట్లు కలరింగ్ ఇచ్చాయి.  దీన్నే  ఎల్లోమీడియా కూడా విపరీతంగా ప్రచారం చేసింది. అయితే సీపీఐ నారాయణ ఈ ఆరోపణలు, వివాదాలకు తెరదించారు.ఇంతకీ విషయం ఏమిటంటే రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను నారాయణ తమ నేతలతో కలిసి స్వయంగా పరిశీలించారు. పరిశీలనకు కోర్టునుండి అనుమతి తెచ్చుకున్నారు. కోర్టుకు ఎందుకు వెళ్ళాల్సొచ్చిందంటే ప్రభుత్వం ఎవరినీ అనుమతించలేదుకాబట్టి. నిర్మాణాలు జరుగుతున్నపుడు ఏమైనా ప్రమాదం జరిగితే జనాలు ఇబ్బందులు పడతారనే ప్రభుత్వం ఎవరినీ అనుమతించలేదు. దాంతో అందరికీ అనుమానాలు పెరిగిపోయాయి. ఈ కారణంతోనే నారాయణ కోర్టులో పిటీషన్ వేసి ఆదేశాలు తెచ్చుకున్నారు.ఇక ప్రస్తుతవిషయానికి వస్తే రుషికొండమీద ప్రభుత్వం బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తోందని నారాయణ మీడియాతో చెప్పారు. ఇంతకాలం జరిగిన ప్రచారానికి అక్కడ జరుగుతున్న పనులకు అసలు సంబంధమే లేదన్నారు. టూరిజం డెవలప్మెంట్ కోసం  మంచి కాటేజీలు, విల్లాలు, డార్మిటరీలు, గ్రీనరీలన్నింటినీ ప్రభుత్వం డెవలప్ చేస్తోందన్నారు. పచ్చదనాన్ని పెంచటం కోసం ప్రభుత్వం భారీఎత్తున మొక్కలను కూడా పెంచుతోందన్నారు. మరో ఐదేళ్ళయితే మొక్కలు బాగా పెరిగితే పచ్చదనం బాగుంటుందని నారాయణ అభిప్రాయపడ్డారు.
జగన్ కోసం భారీ భవనాలు కడుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని నారాయణ స్పష్టంగా ప్రకటించారు. ఎవరినీ అక్కడకు అనుమతించకపోవటంతో అక్కడ ఏమి జరుగుతోందో అనే అనుమానాలు అందరిలోను పెరిగిపోయి తప్పుగా అర్ధం చేసుకున్నట్లు అంగీకరించారు. ఇపుడు చేస్తున్న నిర్మాణాల కోసం కొట్టేసిన చెట్ల స్ధానంలో మళ్ళీ ప్రభుత్వం చెట్లను, పచ్చదనాన్ని పంచేందుకు ఏర్పాట్లు కూడా చేయటం మంచిదన్నారు. ఏదేమైనా తాజాగా నారాయణ చెప్పిన విషయాలతో అయినా మిగిలిన పార్టీలకు, ఎల్లోమీడియాకు బుద్ధివస్తుందేమో చూడాలి. తెలంగాణాలో కేసీయార్ నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ భవనాలపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు, ఎల్లోమీడియాకు నోరు లేవటంలేదు కానీ జగన్ మీద మాత్రం ఒంటికాలిపై లేచిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: