హరితహారం లో విషపు మొక్క.. ఆ చెట్టుతో అంత ప్రమాదమా?

praveen
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఒక కలుపు మొక్క చేరిపోయింది. తక్కువ సమయంలోనే ఎంతో ఏపుగా పెరిగే ఆ మొక్క మనుషులను బలి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. చూడ్డానికి అందరి చేత వావ్ అనిపించేలా అందంగా ఉండే ఈ మొక్క ఎంతోమంది ఊపిరి ఆపేయబోతోంది. అవును ఇలా హరితహారం లో భాగంగా చేరిన ఆ విషపు మొక్క ఏదో కాదు కోనోకార్పస్. ఇప్పటికే మీరు ఈ మొక్కను చూసే ఉంటారు. మీ పరిసర ప్రాంతాల్లోనే హరితహారం కార్యక్రమం లో భాగంగా ఎంతో మంది ఈ మొక్కను నాటే ఉంటారు.

 ఇక నగరాలకు వెళ్తున్న సమయంలో ప్రధాన రహదారుల మధ్యలో ఉన్న డివైడర్ లో ఈ మొక్కను పెంచి అందంగా ముస్తాబు చేయడం కూడా మీ కంటపడే ఉంటుంది. ఇలా చూడ్డానికి అందంగా కనిపించే మొక్క చివరికి మనిషి ప్రాణం తీసేస్తుంది అంటే అందరూ అవాక్కవుతున్నారు.
ప్రమాదం ఏంటంటే..
 విదేశీ మొక్క అయినా కొనో కార్పస్ ఏకంగా వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందట. ఇది కేవలం సముద్ర తీరాల్లో పెరిగే మడ జాతికి చెందిన మొక్క అని వృక్ష శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నా.రు ఇక ఈ మొక్క నుండి వచ్చే ఘాటైన వాసన పీల్చుకోవడం వల్ల ఆస్తమా, అలర్జీ, శ్వాసకోస సంబంధిత సమస్యలు కూడా వస్తాయట. అంతేకాదు పశువులు, పక్షుల లకు ఎంతో ముప్పుగా కూడా ఈ మొక్క మారుతుందట..
 ఎక్కడి నుంచి వచ్చింది అంటే..
 హరితహారం లో భాగమైన ఈ విష గుళిక లాంటి మొక్క కొనో కార్పస్ మొదట్లో అమెరికా తీర ప్రాంతాల్లో మాత్రమే ఉండేదట. ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేదట. మిగతా చెట్ల తో పోసి చూస్తే కాస్త ఎక్కువ పచ్చదనంతో మొక్క అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇలాగే గల్ఫ్ దేశాలను ఆకర్షించడంతో అక్కడ ఈ మొక్కల పెంపకం ఎంతో వేగంగా చేపట్టారు. ఇక అందరూ అనుకున్నట్లుగానే పచ్చదనం వెళ్లి విరిసింది. కానీ ఇక మొక్క వల్ల ప్రమాదం తెలిసి అక్కడ ఈ మొక్కను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 అయితే విదేశాలను సందర్శించిన మన ప్లాంటేషన్ నిపుణులు ఇక ఈ మొక్క గురించి అసలు విషయం తెలియకుండా భారత్కు తీసుకువచ్చారు. ఇలా దేశమంతటా ఈ మొక్క ప్రభావం పాగిపోయింది. ఇప్పటికే కువైట్, ఖతార్, యూఏఈ, పాకిస్తాన్ లాంటి దేశాలు ఇక ఈ మొక్కపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.  ఈ మొక్కలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతంలో ఎక్కువమంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతూ ఉంటారట. అంతలా ఈ మొక్క దుష్పరిణామాలు ఉంటాయన్నది తెలుస్తుంది.
 మొక్కపై నిషేధం..
 హరితహారం లో ఈ మొక్కను నాటువద్దని.. నాటిన మొక్కలను కూడా తొలగించాలని జూన్ 15వ తేదీన తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.. కానీ ఏం లాభం అప్పటికే పెట్టిన మొక్కలు ఏపుగా పెరగడం.. ఇక కొంతమందికి అవగాహన లేక కొత్త మొక్కలను కూడా నాటడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తు ముప్పుపై అవగాహన కల్పించి.. నాటిన మొక్కలను తొలగించడం.. ఇక కొత్త మొక్కలు నాటకుండా జాగ్రత్త పడటం లాంటివి చేస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: