పవన్ "జనసేన"కు ఆదరణ దక్కకపోవడానికి ప్రధాన కారణం ఇదే ?

VAMSI
ఒక సినిమా కథానాయకుడిగా లక్షల మందిని అభిమానాన్ని సంపాదించుకున్న కొణిదెల పవన్ కళ్యాణ్... రాజకీయ నాయకుడిగా కూడా తన స్థాయిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అనే పేరుతో పార్టీని స్థాపించి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తనదైన ముద్ర వేయడంలో మాత్రం వెనుకనే ఉన్నాడు . గత ఎన్నికల్లో పోటీ చేసినా పార్టీ మొత్తానికి కలిపి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ను మాత్రమే పొందగలిగాడు. అయితే ఆ ఎమ్మెల్యే సీటు కూడా పవన్ కళ్యాణ్ ది కాకపోవడం మరో విశేషం. పవన్ పోటీ చేసినా భీమవరం మరియు గాజువాక రెండు చోట్ల ఓటమి పాలయ్యాడు. అప్పటి నుండి రాజకీయాలలో తనదైన ముద్ర వేయడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఎందుకో దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.
ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరో వైపు రాజకీయాలలో రాణించాలంటే పవన్ కు కుదరడం లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. తనకు కుదిరినప్పుడు ఏదో ఒక సమస్యపైన తన స్టైల్ లో ముందుకు రావడం.. సినిమా డైలాగులు కొట్టడం.. మళ్ళీ కొద్ది రోజులు సైలెంట్ అయిపోవడం జరుగుతూ ఉంది. అంతేకానీ క్షేత్ర స్థాయిలో పార్టీని అభివృద్ధి చేయడం పైనే దృష్టి పెట్టలేదని చెప్పాలి. ఈ విషయంపై రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ రాజకీయ ప్రముఖులు సూచిస్తున్నా ఏమీ పట్టనట్టు ఊరుకున్నారు. అయితే జగన్ సీఎం అయ్యాక కానీ పవన్ కు అసలు విషయం బోధపడలేదు... కేవలం వైసీపీ ఈ రోజు ప్రజల్లో ఇంత ఆదరణ కలిగి ఉందంటే దానికి కారణం ప్రజల్లోకి పార్టీ వెళ్లడమే. ఈ విషయంలో మిగిలిన పార్టీలు అంటే... టీడీపీ మరియు జనసేన లు విఫలం అయ్యాయి అని చెప్పాలి.
ఇక ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా జనసేనకు ఏమంత ఆమోదయోగ్యంగా లేవు.. ఎక్కడ మీటింగ్ అయినా ? ధర్నా అయినా ? సమస్య వచ్చినా ? పవన్ కళ్యాణ్ మాత్రమే  వెళుతున్నారు.. కానీ జనసేన నాయకులు మాత్రం స్వతహాగా బాధ్యతగా తీసుకుని సంబంధిత నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేయడం లేదు. ఇకనైనా పాలిటిక్స్ లో కనీసం కొన్ని బేసిక్ విషయాలను తెలుసుకుంటేనే పార్టీ మనుగడ ఉంటుంది అంది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: