ఏపీని వీడని వానలు..ఆ ప్రాంతాలకు అలర్ట్..
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచ్చును .రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది..దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచ్చును.రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమలో ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు..