మరో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టిన రిలయన్స్..

Satvika
రిలయన్స్ బిజినెస్ ల గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్నో రకాల బిజినెస్ లను చేస్తున్నారు. ముఖేష్‌ అంబానీ దేన్నీ వదలి పెట్టరా అని మీకు ఒక్కసారైనా అనిపించి ఉంటుంది కదూ. ఆయన అడుగు పెట్టబోతున్న లిస్ట్‌లోకి హెయిర్‌ కటింగ్ షాపు కూడా చేరింది. మరికొన్ని రోజుల్లో రిలయన్స్‌ వాళ్లు జనాని కి క్షవరం చేస్తారన్న మాట.. రిలయన్స్‌ గ్రూప్‌ లో ఉన్న రిలయన్స్ రిటైల్‌ విభాగం దేశం లోనే అతి పెద్ద కిరాణా దుకాణాల సముదాయం. 


రిటైల్‌ సెగ్మెంట్‌ లో రిలయన్స్‌ రిటైల్‌ది లీడింగ్‌ రోల్‌. రిలయన్స్‌ రిటైల్‌ ద్వారా 'నేచురల్ సలోన్ మరియు స్పా లో దాదాపు సగం వాటాను ముఖేష్‌ అంబానీ కొన బోతున్నారు. 49 శాతం వాటా కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ టీమ్‌ చర్చలు జరుపుతోంది.

చెన్నై ప్రధాన కేంద్రంగా సౌందర్య సంరక్షణ వ్యాపారం చేస్తోంది నేచురల్ సలోన్ & స్పా. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దీనికి భారత దేశం అంతటా 650కి పైగా సెలూన్‌లు ఉన్నాయి. 2025 నాటికి 3,000 సెలూన్‌ ల కు విస్తరించాలన్నది నేచురల్ సలోన్, స్పా ప్లాన్‌. దీని వ్యాపారం మూడు కటింగ్‌లు, ఆరు ఫేషియల్స్‌ గా సాగుతోంది. 49 శాతం వాటా తమకు అమ్మమంటూ, నేచురల్ సలోన్ మరియు స్పా ప్రమోటర్ల ను అంబానీ అడుగు తున్నారు. నేచురల్ సలోన్ & స్పా లో 49 శాతం వాటా కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎంత చెల్లిస్తారన్నది మాత్రం ఇంకా తేలలేదు. నేచురల్‌ సలోన్‌ విలువ ను ఇప్పటికే రిలయన్స్‌ అంచనా వేసింది. దానికి తగ్గట్లు గా 49 వాటా విలువ ఎంతవుతుందో కూడా లెక్క వేసింది.. మొత్తం 700 సెలూన్‌ల నుంచి భవిష్యత్తులో భారీ వృద్ధి ఉండబోతోంది. ఈ కొత్త బిజినెస్ లో ఎంత లాభాన్ని అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: