అమరావతి : పవన్ కు దిక్కుతోచటం లేదా ?

Vijaya






ఏమిచేయాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దిక్కుతోస్తున్నట్లు లేదు. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అవటంకన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. తన టార్గెట్ ను రీచవ్వటం కోసమే సమస్యల పోరాటంపేరుతో ప్రస్తుతానికి చంద్రబాబునాయుడుతో చేతులు కలిపారు.  అయితే వ్రతంచెడినా ఫలితం దక్కుతుందో లేదో తెలీటంలేదు. ఎందుకంటే జగన్ను ఓడించాలంటే చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవాలని పవన్ కు బాగా అనిపిస్తోంది.




ఇదే సమయంలో జనసేన నేతలేమో తెలుగుదేశంపార్టీతో పొత్తు వద్దంటు గోలచేస్తున్నారట. ఇదిసరిపోదన్నట్లు కాపుల్లో మెజారిటి వర్గాలు చంద్రబాబుతో పొత్తువల్ల నష్టమే కానీ లాభం ఉండదని గట్టిగా చెబుతున్నాయట. దీంతో చంద్రబాబుతో పొత్తువిషయంలో ముందుకు వెళ్ళాలా లేకపోతే వెనక్కుతగ్గాలో అర్ధంకాక అయోమయం పెరిగిపోతోందని సమాచారం. చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటే వచ్చే లాభంఏమిటి, పెట్టుకోకపోతే జరిగే నష్టాలేమిటనే విషయమై ఆలోచిస్తున్నారట.



ఒకటైతే నిజం టీడీపీతో పొత్తువల్ల లాభం ఎంతుందో నష్టమూ అంతేవుంది. ఈ విషయంలో పవన్ కు కూడా బాగా క్లారిటి ఉంది. కాకపోతే లాభాలు ఎక్కువా నష్టాలు ఎక్కువా అనే విషయాన్నే తేల్చుకోలేకపోతున్నారు. లాభమో నష్టమో ఒంటిరిగా పోరాడటమే మంచిదని జనసేనలోని నేతలు గట్టిగా చెబుతున్నారట. చంద్రబాబుతో పొత్తువల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జనసేనకు కాపులు ఓట్లేయరనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ఉభయగోదావరి జిల్లాల్లో ఎంతమంది కాపులు జనసేన+టీడీపీకి ఓట్లేస్తారనే విషయంలో సరైన క్లారిటి రావటంలేదట.



రెండుపార్టీల పొత్తువల్ల రెండుపార్టీల మధ్య ఓట్లు ట్రాన్స్ ఫర్ జరిగే అవకాశం తక్కువనే ప్రచారం పెరిగిపోతోంది. ఎప్పుడోజరిగిన వంగవీటి హత్య కారణంగా కాపులంతా కమ్మోరిపై ఇప్పటికీ మండిపోతున్నారు. ఇదిసరిపోదన్నట్లుగా 2014-19 మద్య చంద్రబాబు హయాంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించిన ఘటనలు కాపుల కళ్ళముందు ఇంకా కనబడుతోంది. ఈ రెండు కారణాల వల్లే చంద్రబాబంటే కాపుల్లో ఎక్కువమందికి బాగా మంటుంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వంగవీటి రంగా హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబే ముద్రగడపద్మనాభం విషయంలో కూడా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: