రైల్లో అలా చేస్తున్నారా? అయితే మీకు మూడినట్లే..

Satvika
రైల్లో ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది.. అందుకే చాలా మంది రైల్లో ప్రయాణం ఇష్ట పడతారు.రాత్రి పూట ప్రయాణించే ప్రయాణికుల కోసం తాజాగా రైల్వే శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా.. రాత్రిపూట ప్రయాణించేవారికి ఇవి తప్పనిసరిగా వర్తిస్తాయి. ఈ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ స్పష్టం చేసింది... ఇక ఆలస్యం ఎందుకు ఆ నిభంధనలను ఒకసారి చూడండి..


రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల లో ప్రయాణించే ఏ ప్రయాణికు డు కూడా గట్టిగా మాట్లాడకూడదు. అలాగే లైట్లు కూడా వెయ్యకూడదు.

స్పీకర్ పెట్టి సెల్‌ఫోన్లలో పాటలు వినకూడదు
ప్రయాణీకులు, రైల్వే ఎస్కార్టు, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌.. ఇలా ఎవ్వరూ కూడా రాత్రివేళ రైళ్ల ల్లో గట్టిగా అరవకూడదు.
మిడిల్ బెర్త్ వచ్చిన ప్రయాణీకులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చు.
రాత్రి 10 గంటల తర్వాత టీటీలు టికెట్ల తనిఖీ చేయరాదు.
కేటాయించిన సీటుకు సంబంధించిన ప్రయాణీకులు ఎవరైనా రాకపోతే.. దాన్ని వేరే ప్రయాణీకులకు (ఆర్ఏసీ) కేటాయించకూడదు.సీట్ కేటాయించిన వ్యక్తులు రాకపోతే రెండు స్టేషన్లు లేదా గంట తర్వాత వేరేవారికి టీటీఈ సీటు కేటాయించాలి.
ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రైలు లో ప్రయాణించేటప్పుడు.. ఒకరికి సీట్ కన్ఫర్మ్ అయ్యి.. మరొకరికి అవ్వకపోతే.. ఒకవేళ అందులో కన్ఫర్మ్ అయిన వ్యక్తి ప్రయాణించకపొతే.. దాన్ని సీట్ కన్ఫర్మ్ కాని వ్యక్తికి కేటాయించాలి.ఇప్పటికే ఈ నిబంధనలు అమలులో ఉండగా.. వీటిని ప్రయాణీకులు కచ్చితంగా పాటించాలని రైల్వేశాఖ తెలిపింది. ఎందుకంటే ఇప్పటికే పలువురు ప్రయాణీకుల నుంచి రాత్రివేళల్లో కొంతమంది బిగ్గరగా అరుస్తున్నారని, లైట్లు వేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు అందటం తో రూల్స్ ను సక్రమంగా పాటించేలా చర్యలు తీసుకొవాలని అధికారులకు సూచించారు.. ఎవరైనా అతిక్రమిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: