అమరావతి : వీళ్ళ విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసేసుకున్నారా ?

Vijaya
వచ్చే ఎన్నికల్లో గెలిచితీరాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబునాయుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారట. ఇలాంటి నిర్ణయాల్లో  ఒకటేమిటంటే వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిన వారికి నో టికెటని. ఈ పాలసీలోనే సీనియర్ నేత రూపంలో పార్టీకి మోయలేని బరువుగా తయారైన మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉన్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని తుని  యనమల సొంత నియోజకవర్గం. ఒకప్పటి మాటేమో కానీ గడచిన మూడు ఎన్నికల్లో యనమల కుటుంబం, నాలుగు ఎన్నికల్లో సోమిరెడ్డి పార్టీకి గుదిబండగా మారిపోయారు.సీనియర్లని చంద్రబాబుకు అత్యంత సన్నిహితులనే బిల్డప్ తో ఇంతకాలం పార్టీలో నెట్టుకొచ్చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో ఈ పప్పులేవీ ఉడకటంలేదని సమాచారం. వచ్చే ఎన్నికల్లో యనమల ఫ్యామిలీకి, సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఎందుకంటే ఒకసారి యనమల రామకృష్ణుడు ఓడిపోయారు. మరో రెండుఎన్నికల్లో వరుసగా రామకృష్ణుడి తమ్ముడు యనమల కృష్ణుడు ఓడిపోయారు. సోమిరెడ్డి అయితే వరుసగా నాలుగుసార్లు ఓడిపోయారు.అంటే గడచిన మూడు ఎన్నికల్లో యనమల సోదరులు వరుసగా ఓడిపోయారు. దాంతో పార్టీ బాగా బలహీనమైపోయింది. నిజానికి యనమలకు పార్టీమీద పట్టులేదు. కాకపోతే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని, సీనియర్ అనే ముద్రుండటంతో నియోజకవర్గంలో యనమలకు పోటీగా మరోనేత తయారుకాలేదు. ఇపుడిదే పార్టీకి పెద్ద శాపంగా మారిపోయింది. యనమల మోయలేని బరువుగా మారిన నేపద్యంలో ఆయన కుటుంబానికి ప్రత్యామ్నాయంగా మరో నేతే కనబడటంలేదు.  వచ్చే ఎన్నికల్లో తన కూతురు దివ్యకు టికెట్ ఇవ్వాలని యనమల పట్టుబడుతున్నారట.అయితే యనమల కుటుంబంలో ఎవరికిచ్చినా ఓటమి ఖాయమనే విషయం ఇప్పటికే అర్ధమైపోయింది నేతలకు. మొత్తంమీద క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితి చూసిన తర్వాత అర్ధమవుతున్నదేమంటే యనమల కుటుంబం లాభంలేదని, యనమల కుటుంబానికి ప్రత్యామ్నాయంగా మరో నేత లేరని. ఈ సమస్య ఎలాగ వచ్చిందంటే తాను తప్ప నియోజకవర్గంలో మరో నేత ఎదగకూడదన్న యనమల ఆలోచన వల్లే వచ్చిందన్నది అందరికీ తెలుసు. ఇలాంటి నేతలు పార్టీలో ఇంకా ఎంతముందున్నారో అర్ధం కావటంలేదు. సోమిరెడ్డి విషయంలో కూడా ఇలాగే ఉంది. మరి వీళ్ళ భవిష్యత్తేమిటో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: