గుజరాత్ కేబుల్ బ్రిడ్జి పడిపోవడానికి కారణాలు అవేనా ?

VAMSI
నిన్న సాయంత్రం గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఓ దుర్ఘటన దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఆందోళనలు గురి చేసింది. గుజరాత్ లోని మోర్భి ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి విరిగి దాని కిందనే ఉన్న నదిలో పడిపోయింది. ఆ సమయంలో కేబుల్ బ్రిడ్జి పై ఉన్న 500 మంది పర్యాటకులు నదిలో పడిపోవడం జరిగింది. అయితే హుటాహుటిన సంఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలిసిన అప్డేట్ ప్రకారం మృతులు సంఖ్య 100 కి చేరిందట. నదిలో పడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు... ఈ విషయంపై పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు.
ప్రధాని మోదీ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ములు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నాలుగు లక్షలు పరిహారం ప్రకటించారు మరియు గాయాల పాలు అయిన వారికి వేల రూపాయలు పరిహారం అందించనున్నారు. నదిలో పడి ఇంకా దొరకని వారి కోసం గాలింపు చర్యలు వేగవంతంగా సాగుతున్నాయని గుజరాత్ హోమ్ మినిస్టర్ సంఘవి తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నో కేబుల్ బ్రిడ్జి లు నిర్మించబడ్డాయి. అయితే అన్నీ కూడా చాలా దృడంగా నిర్మిచబడి ఉంటాయి.. కానీ గుజరాత్ లోనే మోర్భి కేబుల్ బ్రిడ్జి మాత్రం ఎందుకు సడెన్ గా కూలిపోయింది అంటూ దేశవ్యాపితముగా చర్చ జరుగుతోంది. దీనిపై పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ కేబుల్ బ్రిడ్జి ను గత 143 సంవత్సరాల క్రితమే మచ్చు నదిపై నిర్మించారు, అప్పట్లో బొంబాయి గవర్నర్ రిచర్డ్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇది నిర్మితమైందట. ఈ బ్రిడ్జి పొడవు మొత్తం 765 అడుగులు.. ఇది చాలా పాత బ్రిడ్జి కావడం వలన ఇటీవల ప్రమాదానికి అయిదు రోజుల క్రితమే కొన్ని మరమ్మతులు చేశారట. అంతే కాకుండా గత రెండు నెలలుగా ఈ బ్రిడ్జి ఉపయోగంలో లేదని అధికారుల ద్వారా తెలుస్తోంది. పురాతన బ్రిడ్జి కావడం మరియు మూడు రోజుల క్రితమే ఓపెన్ చేయడం, పైగా రెండు నెలలు మూసి ఉంచడంతో ఒక్కసారిగా ప్రజలు కేబుల్ బ్రిడ్జి పైకి పరిమితి లేకుండా రావడంతో ఒత్తిడి పెరిగి పోయి విరిగిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: