అమరావతి : పవన్ను కాపులే ఒప్పుకోవటం లేదా ?

Vijaya





చంద్రబాబునాయుడుతో చేతులు కలిపేటపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి ఆలోచించారో తెలీదు. కానీ చేతులు కలిపిన తర్వాత మొదలైన రియాక్షన్ మాత్రం పవన్ కు పూర్తి వ్యతిరేకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యపరిరక్షణ పేరుతో ఇపుడు చేతులు కలిపినా మెల్లిగా ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారని అందరు అనుకుంటున్నదే. కాకపోతే బీజేపీ విషయంలోనే వీళ్ళిద్దరు ఏమీ తేల్చుకోలేక అవస్తలు పడుతున్నారు.



సరే ఇపుడు చంద్రబాబుతో పవన్  చేతులు కలపటాన్ని కాపులే జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్ధమవుతోంది. మామూలుగా అయితే ఉఢయగోదావరి జిల్లాల్లో కాపులు-కమ్మల మధ్య పెద్ద సఖ్యతలేదు. అలాగే బీసీలు-కాపులకు బద్ధి విరోధముందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా కృష్ణా జిల్లాలో కూడా కమ్మోరిని కాపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం మెల్లిగా బయటకువస్తోంది. ఇది గుంటూరు జిల్లాకు కూడా పాకుతుందేమో చూడాలి.



కమ్మ వాళ్ళతో పవన్ చేతులు కలపితే తాము ఎందుకు అంగీకరిస్తామంటు కొందరు కాపులు బాహాటంగానే పవన్ను తప్పుపడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. పవన్ను ఇంతస్ధాయిలో కూర్చోబెట్టింది కాపులే కానీ వేరే సామాజికవర్గం వాళ్ళు కాదంటు విజయవాడలోని ఒక కాపు వ్యక్తి బహిరంగంగానే మండుతున్నారు. తనవసరాలకు చంద్రబాబుతో పవన్ చేతులు కలిపితే తామెందుకు వాళ్ళకు ఓట్లేస్తామంటు నేరుగా పవన్నే నిలదీశారు. సో కాపుల్లో మెల్లిగా బయటకు వస్తున్న మంటను చూస్తుంటే రేపటి ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య ఓట్ల షేరింగ్ అంత ఈజీకాదన్న విషయం తెలిసిపోతోంది.



విజయవాడలో ఎవరో వ్యక్తి బహిరంగంగా పవన్ వ్యతిరేకిస్తు మాట్లాడారు.  చంద్రబాబు-పవన్ చేతులు కలవటం ఇష్టంలేకపోయినా బహిరంగంగా మాట్లాడని వాళ్ళు ఎంతమందున్నారో తెలీదు. టీడీపీ, జనసేన కలయికను వ్యతిరేకిస్తు సోషల్ మీడియాలో పోస్టులు కూడా ఇప్పటికే పెరిగిపోతున్నాయి. ఏదేమైనా తామిద్దరం కలిస్తే జగన్ను తేలిగ్గా ఓడించేయచ్చని చంద్రబాబు, పవన్ అనుకున్నంత తేలిక్కాదని అర్ధమవుతోంది. మరి ముందుముందు ఇంకెంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సొస్తుందో చూడాల్సిందే. కాపుసంఘాలు ఏమంటాయో చూస్తేగానీ తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: