అమరావతి : అప్పుడే సీపీఐ చంద్రబాబు, పవన్ ను ఇబ్బందులు పెడుతోందా ?

Vijaya




వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే పార్టీలతో కలవటానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతూనే సీపీఐ ఒకకండీషన్ పెట్టింది. ఇంకా వీళ్ళతో చేతులు కలపకుండానే కండీషన్లు మొదలుపెట్టడమే ఆశ్చర్యంగా ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ చేతులు కలిపిన విషయం తెలిసిందే. ప్రతిపక్షపార్టీలన్నీ ఏకం కాకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు తప్పదని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.



చంద్రబాబు అలా పిలుపిచ్చారో లేదో వెంటనే సీపీఐ జాతీయ కార్యదర్శి కంకణాల నారాయణ స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై పోరులో తాము భాగస్వామ్యం అవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పేశారు. అయితే బుధవారం ఇటు చంద్రబాబుతో పాటు అటు పవన్ కు కూడా ఒక కండీషన్ పెట్టారట. ఇంతకీ ఆ కండీషన్ ఏమిటంటే బీజేపీతో పవన్ మిత్రత్వాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించాలట.




బీజేపీతో ఒకవైపు మిత్రపక్షంగా ఉంటునే మరోవైపు మిగిలిన ప్రతిపక్షాలతో కలవాలని పవన్ అనుకోవటంపై అభ్యంతరం చెప్పారట. టీడీపీ, జనసేనతో కలవటానికి తాము సిద్ధంగానే ఉన్నామని అయితే బీజేపీతో కలిసేది మాత్రం లేదని తెగేసిచెప్పారట. పవన్ కూడా బీజేపీతో కటీఫ్ చెప్పేస్తే టీడీపీ, జనసేనతో కలిసి పనిచేస్తామని నారాయణ చెప్పారని సమాచారం. అంటే నారాయణ కండీషన్ ప్రకారం పవన్ వెంటనే బీజేపీతో స్నేహాన్ని కటీఫ్ చేసుకోవాల్సిందే. మరాపని పవన్ ఇప్పుడే చేయగలరా ?



మొన్నటి పార్టీ నేతల సమావేశంలోనే బీజేపీ వైఖరితో తాను విసిగపోయానని, తన నిర్ణయం తాను తీసేసుకున్నట్లు పవన్ చెప్పిన విషయం తెలిసిందే. పవన్ ప్రకటన చేసిన కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు వచ్చి పవన్ తో భేటీఅయ్యారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరి భేటీ జరిగిందో అప్పుడే పవన్ బీజేపీకి దూరమైపోయినట్లు లెక్క. అయితే మిత్రత్వాన్ని వదులుకుంటున్నట్లు పవన్ ఇప్పటివరకు ప్రకటన అయితే చేయలేదు. కాబట్టి టెక్నికల్ గా బీజేపీకి జనసేన ఇంకా మిత్రపక్షమనే అనుకోవాలి. ఈ విషయంలోనే సీపీఐ అభ్యంతరం లేవదీసిందని సమాచారం. మరి నారాయణ అభ్యంతరాన్ని పవన్ పట్టించుకుంటారా ? కండీషన్ను ఆమోదిస్తారా ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: