పెన్షనర్లకు గుడ్ న్యూస్..మరో కొత్త ఫీచర్..

Satvika
ఈపీఎస్ పెన్షనర్లకు ఒక గుడ్‌న్యూస్ను చెప్పింది ప్రభుత్వం..ఇప్పుడు వీరు జీవన్‌ ప్రమాణ పత్ర లేదా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను సులువుగా సబ్‌మిట్ చేయవచ్చు. ఇందుకు ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తొలుత బయోమెట్రిక్‌ విధానం తీసుకొచ్చారు. ఈ పద్ధతితో చాలా మంది పెన్షనర్లకు ప్రయోజనాలు అందాయి. వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారి ఫింగర్‌ప్రింట్స్‌ను బయోమెట్రిక్‌ డివైజ్‌లు క్యాప్చర్‌ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఈ సమస్యలకు చెక్‌ పెడుతూ వృద్ధుల కోసం తాజాగా ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీని అధికారులు తీసుకొచ్చారు. ఈ విధానం ఎలా పని చేస్తుంది, పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం..

1995కి సంబంధించిన పెన్షనర్లు ఇప్పుడు uidai ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు. ఇంతకుముందు పెన్షనర్లు ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ డివైజ్‌లు, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌లు లేదా ఐరిస్ స్కానర్‌లను ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది..యాప్‌ను ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెర్షన్ 7.0, ఆ తర్వాత వెర్షన్లపై రన్‌ అవుతుంది. ఈ యాప్‌ను ఉపయోగించడానికి, పెన్షనర్ ఆధార్ నంబర్‌ను పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ (బ్యాంక్/పోస్ట్ ఆఫీస్/ఇతరులు)తో రిజిస్టర్ చేయాలి.

మొదట గూగుల్ ప్లేస్టోర్‌ని ఓపెన్‌ చేసి "ఆధార్ ఫేస్ RD యాప్" డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత https://jeevanpramaan.gov.in నుంచి జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ (V3.6.1)ని ఇన్‌స్టాల్ చేయాలి. ఆధార్, ఇ-మెయిల్ IDకి వచ్చిన సమాచారంతో, ఫేస్‌ స్కానింగ్‌ చేసి వన్‌టైమ్‌ ఆపరేటర్‌ అథెంటికేషన్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది..ఫేస్ స్కానింగ్ సమయంలో పెన్షనర్ తప్పనిసరిగా కళ్ళు రెండు మూడు సార్లు రెప్పవేయాలి. ఫేస్ స్కానింగ్ ప్రాంతంలో సరైన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత ప్రమాణ్ ID, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పొందవచ్చు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకునే లింక్ మొబైల్‌కు SMS ద్వారా వస్తుంది. లింక్‌ని క్లిక్ చేసిన తర్వాత 10-అంకెల ప్రమాణ్ ID, క్యాప్చా ఫీడ్ ఎంటర్‌ చేయాలి. పెన్షనర్ ఫోటో, తేదీ, సమయంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: