మునుగోడులో బీజేపీ ఓటమిని ఒప్పేసుకుందా ?

VAMSI
ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన వార్త మరియు ఆ సమయం రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆ స్థానం ఖాళీ అయి చాలా రోజులు అయినప్పటికీ ఎన్నికల సంఘం నుండి ఎటువంటి షెడ్యూల్ విడుదల కాలేదు. కానీ తాజాగా ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. దీనితో తెలంగాణాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక ఎప్పటిలాగా తెరాస మరియు బీజేపీ ల మధ్యన మాన్తా రాజుకుంది. తెరాస మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంటకు ఆజ్యం పోశాయి.
ఆయన మాట్లాడుతూ ఎప్పుడో గుజరాత్ ఎన్నికతో పాటుగా పెట్టాల్సిన ఉప ఎన్నిక ఇప్పుడే ఎందుకు పెడుతున్నారంటూ చురక అంటించారు. దీనికి బీజేపీ కి ఉన్న భయం కారణంగానే అంటూ మాట్లాడడంతో.. దీనికి రాజకీయ విశ్లేషకులు తగిన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాస్తవంగా గుజరాత్ రాష్ట్రంతో పాటుగా ఎన్నక నిర్వహిస్తే ప్రధాని మోదీ మరియు హోమ్ మంత్రి అమిత్ షా ల సొంత రాష్ట్రము కాబట్టి అక్కడే ఫుల్ ఫోకస్ పెట్టాలి... అప్పుడు తెలంగాణలో ప్రచారం చేసే అవకాశం ఉండదు. అందుకు ముందుకుగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు.
అయితే పోల్చి చూస్తే మాత్రం బీజేపీ కి అటుంచితే... వ్యక్తిగతంగా మోదీకి గుజరాత్ ఎన్నికలలో గెలవడం చాలా అవసరం. అందుకే దానిపైనే ఎక్కువ దృష్టి పెడతారు అన్నదానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగని మునుగోడు ఉప ఎన్నికను తేలికగా తీసుకోరు. ప్రస్తుతం బీజేపీ పై వస్తున్న విమర్శలకు ప్రతి ఎన్నికలో గెలవడం ముఖ్యం. కానీ బీజేపీ ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకుందంటూ మరికొందరు కూడా ఆలోచనలో పడ్డారు. మునుగోడు లో బీజేపీ ఓటమిని ముందుగానే ఇలా చేసి ఒప్పేసుకుందా అంటున్నారు మరికొందరు. మరి ఏది నిజమో ? బీజేపీ చేసింది కరెక్టా కదా అని తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: