హైదరాబాద్ : ఎర్రన్నలు అభిమానాన్ని దాచుకోలేకపోతున్నారా ?

Vijayaతెలుగురాష్ట్రాల్లో ఎర్రన్నలు చంద్రబాబునాయుడుమీద తమఅభిమానాన్ని దాచుకోలేకపోతున్నారు. ఎర్రన్నలంటే ఇక్కడ అర్ధం సీపీఐ అని మాత్రమే. తెలంగాణా కార్యదర్శిగా అపాయింటైన కూనంనేని సాంబశివరావు ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు మీద తనకున్న అభిమానాన్నంతా చూపించారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతు చంద్రబాబును ఏపీలోని అధికార వైసీపీ నేతలు అన్నేసి మాటలంటుంటే చాలా బాధగా ఉందన్నారు. తనకే ఇంత బాధగా ఉంటే మరి టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్ధం కావటంలేదంటు తెగ బాధపడిపోయారు.
ఏపీలో రౌడీయిజం నడుస్తోందని మండిపోయారు. ఏపీలో పోరాటస్వభావం ఉన్న నేతల అవసరం చాలా ఉందని తేల్చేశారు. పోరాటస్వభావం ఉన్న నేతల అవసరం ఉందంటే దాని అర్ధం ఎర్రపార్టీలు  సీపీఐ+సీపీఎం కూడా చప్పపడిపోయాయనే కదా అర్ధం. ఇంతకీ చంద్రబాబును వైసీపీ నేతలు అన్నేసి మాటలు ఎందుకంటున్నారసలు ? అని కూనంనేని ఎప్పుడైనా ఆలోచించారా ?2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు అండ్ కో జగన్మోహన్ రెడ్డిని కలిపి మిగిలిన నేతలందరినీ ఎంతగా వేధించారో కూనంనేనికి తెలీదా ? టీడీపీ ప్రభుత్వం ఎంతమంది మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపిందో  కూనంనేని చూడలేదా ? అసెంబ్లీలో జగన్ను చంద్రబాబు అండ్ కో ఏ స్ధాయిలో ర్యాగింగ్ చేసిందో ఈ ఎర్రన్నకు తెలీదా ? అందుకే కదా అసలు వైసీపీ ఎంఎల్ఏలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది.
ఇక ఏపీ కార్యదర్శి రామకృష్ణ అయితే చంద్రబాబుకు ప్రధాన మద్దతుదారుగా మారిపోయారు. చంద్రబాబు అమరావతి కాన్సెప్టును ఒకపుడు తీవ్రంగా వ్యతిరేకించిన రామకృష్ణ ఇపుడు అదే అమరావతికి ఎందుకంత మద్దతుదారుడిగా మారిపోయారు ? అవసరం లేకపోయినా జగన్ను సీపీఐ ఎందుకింతగా వ్యతిరేకిస్తున్నది ? విచిత్రం ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పిలుపిచ్చిన ప్రతి కార్యక్రమానికి రామకృష్ణ సానుకూలంగా స్పందిస్తున్నారు. సీపీఐ సమావేశాల్లో రామకృష్ణ వైఖరిని తప్పుపట్టినా ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు మీద సీపీఐ ఎందుకింత అభిమానం చూపిస్తోందో  అర్ధంకావటంలేదు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: